DRDO : చైనాకు చెమటలు పట్టించే ఆయుధం.. సైన్యానికి DRDO నుంచి మరో అస్త్రం! శత్రుదేశాలకు ముచ్చెమటలు పట్టించేందుకు లైట్ ట్యాంక్ జోరావర్ అభివృద్ధి ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తదుపరి పరీక్షల కోసం DRDO వాటిని ఆర్మీకి అప్పగించవచ్చు. ఏప్రిల్ నాటికి వీటిని అప్పగించనుంది. భారత సైన్యం 59 జోరావత్ ట్యాంకుల ఉత్పత్తికి ఆదేశించింది. By Bhoomi 13 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి DRDO : శత్రుదేశాల వెన్నువణుకు పుట్టించేందుకు సైన్యం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే 'జోరావర్'('Zorawar') ఆర్మీ బలాన్ని మరింత పెంచబోతోంది. ఈ లైట్ ట్యాంకుల అభివృద్ధి ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) దీనిని తదుపరి పరీక్ష కోసం ఏప్రిల్ నాటికి భారత సైన్యానికి అప్పగించవచ్చు. ఈ మేరకు రక్షణ శాఖ(Department of Defense) అధికారులు సమాచారం అందించారు. 59 జొరావర్ లైట్ ట్యాంకుల ఉత్పత్తి, సరఫరా కోసం సైన్యం DRDOకి ఆర్డర్ ఇచ్చింది. లార్సెన్ & టూబ్రోతో వీటిని ఉత్పత్తి చేస్తున్నారు.రక్షణ శాఖ అధికారులు మాట్లాడుతూ.. 'లైట్ ట్యాంక్(Light tank)ను కొత్త ఇంజన్‌తో తయారు చేసే పనులు ప్రారంభమయ్యాయి. ట్యాంక్ 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం రవాణా చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి భారత సైన్యానికి అందజేయాలని భావిస్తున్నారు. 59 జొరావర్ లైట్ ట్యాంకుల(Zorawar Light Tanks) ఉత్పత్తి, సరఫరా కోసం సైన్యం DRDOకి ఆర్డర్ ఇచ్చింది. లార్సెన్ & టూబ్రో (Larsen & Toubro) సహకారంతో వీటిని తయారు చేస్తున్నట్లు తెలిపారు. మరో 295 లైట్ ట్యాంకులు: ఈ లైట్ ట్యాంక్‌ను ఎడారి లేదా ఎత్తైన ప్రదేశాలలో పరీక్షించడానికి గతేడాది డిసెంబర్ నాటికి భారత సైన్యానికి అప్పగించాల్సి ఉంది. కానీ, జర్మనీ నుంచి ఇంజిన్ సరఫరాలో జాప్యం కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యమైందని అధికారులు తెలిపారు.భారత సైన్యం ప్రత్యేక కార్యక్రమం కింద మరో 295 లైట్ ట్యాంకులను కొనుగోలు చేసేందుకు టెండర్‌ను దాఖలు చేయనుంది. ఇందుకోసం ఆరు నుంచి ఏడు కంపెనీలు తమ లైట్ ట్యాంకులను అందజేయనున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్టుకు భారత సైన్యం పూర్తిగా సహకరిస్తోంది. ప్రపంచ స్థాయి ఆయుధ వ్యవస్థలను తయారు చేసేందుకు ప్రైవేట్ రంగ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఎల్‌అండ్‌టితో కలిసి పనిచేస్తున్న డిఆర్డివో: అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, భారత సైన్యం లడఖ్ సెక్టార్‌లో దాని కదలిక, యుక్తి సామర్థ్యాలను మెరుగుపరచడానికి లైట్ ట్యాంక్ ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. చైనా కూడా తన లైట్ ట్యాంకులను పెద్ద సంఖ్యలో ఇక్కడ మోహరించింది. చైనా నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కొనేందుకు భారత సైన్యం కూడా ఇలాంటి సామర్థ్యాలను కలిగి ఉందని భావించింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల ఈ ప్రాజెక్టును ఆమోదించింది. 25 టన్నుల బరువున్న లైట్ ట్యాంకులను తయారు చేసే ప్రాజెక్ట్‌లో ఎల్‌అండ్‌టితో కలిసి DRDO పని చేస్తోంది. ఈ ట్యాంకులు ఎత్తైన పర్వత ప్రాంతాలలో వేగంగా, సులభంగా కదలగలవు. మేక్ ఇన్ ఇండియా చొరవ కింద ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఈనెలలోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ? #drdo #zorawar #light-tank మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి