Mobile Battery Tips: మీ మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ వెంటనే అయిపోతుందా? ఇలా చేయండి ఎక్కువ కాలం ఉంటుంది..

ప్రస్తుత కాలంలో 5000mAh నుండి 7000mAh వరకు బ్యాటరీలు కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎక్కువ ఛార్జ్‌తో వస్తాయి. అయితే ఈ బ్యాటరీని సరిగా మెయింటెయిన్ చేయకుంటే కొన్ని నెలల్లోనే పాడయ్యే అవకాశం ఉంది. ఇటీవలికాలంలో విడుదలవుతున్న చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఫాస్ట్ ఛార్జర్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. కొన్ని నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయిపోతున్నాయి. అయితే, సరైన నిర్వహణ లేకపోతే.. బ్యాటరీ అంతే త్వరగా పాడైపోతుంది. అయితే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే ఏం చేయాలి? తెలియాలంటే పైన లింక్ క్లిక్ చేయండి..

New Update
Mobile Battery Tips: మీ మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ వెంటనే అయిపోతుందా? ఇలా చేయండి ఎక్కువ కాలం ఉంటుంది..

Mobile Battery Tips: ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్(Mobile Phone) వినియోగించని వారు చాలా అరుదనే చెప్పాలి. స్కూల్ పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరూ మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే, చాలా మంది మొబైల్ యూజర్లు ఎదుర్కొనే సమస్య ఛార్జింగ్(Charging) సమస్య. తమ మొబైల్ వెంటనే వెంటనే ఛార్జింగ్ దిగిపోతుందని చాలా మంది కంప్లైంట్స్ ఇస్తుంటారు. ఏం చేయాలో అర్థం కాక.. ఛార్జింగ్ సపోర్ట్ కోసం పవర్ బ్యాంక్‌ను కొనుగోలు చేస్తారు.

ఇక ప్రస్తుత కాలంలో 5000mAh నుండి 7000mAh వరకు బ్యాటరీలు కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎక్కువ ఛార్జ్‌తో వస్తాయి. అయితే ఈ బ్యాటరీని సరిగా మెయింటెయిన్ చేయకుంటే కొన్ని నెలల్లోనే పాడయ్యే అవకాశం ఉంది. ఇటీవలికాలంలో విడుదలవుతున్న చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఫాస్ట్ ఛార్జర్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. కొన్ని నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయిపోతున్నాయి. అయితే, సరైన నిర్వహణ లేకపోతే.. బ్యాటరీ అంతే త్వరగా పాడైపోతుంది. అయితే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే ఏం చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1. మీ మొబైల్‌తో వచ్చిన అందించిన ఛార్జర్ తోనే ఫోన్‌ను ఛార్జ్ చేయండి. ప్రస్తుతం అన్ని మొబైల్స్ USB కేబుల్ ద్వారా ఛార్జ్ చేయబడతాయి. కంప్యూటర్‌లో పెట్టుకున్నా లేదా ఇతర కంపెనీల ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేసినా సమస్య వస్తుంది. అందుకే కంపెనీ అందించిన ఛార్జర్ ద్వారా మాత్రమే మీ మొబైల్‌ను ఛార్జ్ చేయండి. తద్వారా బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది.

2. మొబైల్ వేడెక్కడం వల్ల బ్యాటరీపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ర్యామ్ తక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ గేమ్స్ ఆడితే మొబైల్ వేడెక్కుతుంది. ఇలాంటి పరిస్థితిలో గేమ్ ఆడటం మానేయాలి. మొబైల్ చల్లబడే వరకు ఉపయోగించవద్దు.

3. వీలైనంత వరకు కారు, బైక్ ఛార్జర్ల ద్వారా ఫోన్ బ్యాటరీని రీఛార్జ్ చేసే అలవాటును మానుకోవాలి. ఎందుకంటే.. దాని నుండి వచ్చే అధిక కరెంట్ ఫోన్ బ్యాటరీపై ప్రభావం చూపుతుంది.

4. కొంతమంది తమ మొబైల్‌లను రాత్రిపూట ఛార్జింగ్ పెట్టి అలాగే వదిలేస్తారు. ఇలా చేయడం ప్రమాదకరం. దీని వల్ల బ్యాటరీ చాలా త్వరగా డౌన్ అయిపోతుంది. 90% ఛార్జ్ అయిన వెంటనే ఛార్జర్‌ను ఆఫ్ చేయండి.

5. వైఫై, బ్లూటూత్ ద్వారా ఛార్జ్ చేసే వైర్‌లెస్ ఛార్జర్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటికి వీలైనంత దూరంగా ఉంటే మొబైల్ బ్యాటరీ బాగుంటుంది.

6. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడం ఎంత పెద్ద పొరపాటో.. బ్యాటరీ తక్కువగా ఉంచుకోవడం కూడా అంతే పొరపాటు. బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉండటం వలన బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మొబైల్ ఛార్జ్ 20 శాతం చేరిన వెంటనే 80 శాతం ఛార్జింగ్ వచ్చే వరకు ఛార్జ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది.

Also Read: 

బిల్డప్ వద్దు..టోఫెల్ లో 4500 కోట్ల స్కాం నిరూపించండి..!!

దసరాలోపు వీటిని ఇంటికి తెచ్చుకుంటే…మీరు పట్టిందల్లా బంగారమే..!!

Advertisment
తాజా కథనాలు