Telangana:రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్ లా? ఇది అన్యాయం:ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ప్రజలను దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రోస్టర్ పాయింట్లు లేని సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం సరైనది కాదని తెలిపారు. జీవో నంబర్‌ 3ను ఉపసంహరించుకోవాలని కోరారు.

Telangana:రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్ లా? ఇది అన్యాయం:ఎమ్మెల్సీ కవిత
New Update

Kavitha: తెలంగాణలో అడవిబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ప్రజలను దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. అలాగే ఉద్యోగ అవకాశాల్లో స్త్రీల హక్కులను హరించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

నియామకాల్లోనూ అన్యాయం..
ఈ మేరకు రోస్టర్ పాయింట్లు లేని సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం సరైనది కాదని తెలిపారు. తెలంగాణలో మహిళల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని, నియామకాల్లోనూ అన్యాయం జరిగేలా తీసుకొచ్చిన జీవో నంబర్‌ 3ను ఉపసంహరించుకోవాలని చెప్పారు. ఇందుకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆమె లేఖ రాసినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : AP: పొత్తులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. విష్ణువర్ధన్ రెడ్డికి అధిష్టానం సీరియస్ వార్నింగ్!

మహిళలకు తీరని అన్యాయం..
'రేవంత్ సర్కార్ రిజర్వేషన్ల స్ఫూర్తిని పక్కకుపెట్టి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీవో తీసుకురావడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను నమ్మి తెలంగాణ ప్రజలు, విద్యార్థులు ఓట్లు వేశారు. ఆనాడు తెలంగాణ విద్యార్థినుల చావులతో సహా అనేక అంశాలను రాజకీయం చేసి ఓట్లు కూడగట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రత్యేక శైలిని అవలంభించింది. ఇప్పుడు ఆడబిడ్డల హక్కలను తుంగలో తొక్కుతుంది. సుప్రీంకోర్టు తీర్పును పాటించబోమంటూ బీహార్, కర్ణాటక రాష్ట్రాలు జీవోలు జారీ చేశాయి. ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ జీవోను తక్షణమే వెనక్కి తీసుకునేలా సీఎంకు ఆదేశాలు జారీ చేయాలి' అంటూ ఆమె రిక్వెస్ట్ చేశారు.

#cm-revanth #brs-mlc-kavitha #request #reddy-reservation
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe