ఢిల్లీ మద్యం కుంభకోణం .. వర్చువల్‌గా హాజరుకానున్న కవిత

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్‌గా హాజరుకానున్నారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌పై ఈ రోజు న్యాయమూర్తి విచారణ జరపనున్నారు. కవితతో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా వర్చువల్‌గా హాజరుకానున్నారు. 

KAVITHA
New Update

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో కల్వకుంట్ల కవిత ఈ రోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్‌గా హాజరుకానున్నారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌పై ఈ రోజు న్యాయమూర్తి విచారణ జరపనున్నారు. ఈ రోజు కోర్టు విచారణకు ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఇతర నిందితులు కూడా వర్చువల్‌గా హాజరుకానున్నారు. 

ఇది కూడా చూడండి: Rotten Chicken: స్పెషల్ చికెన్‌.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!

ఛార్జ్ షీట్‌ ఖాళీగా ఉందని..

సీబీఐ అందజేసిన ఛార్జ్ షీట్‌లోని కాపీలు చాలా వరకు బ్లాంక్‌గా ఉన్నాయని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు కోర్టుకు తెలిపారు. దీంతో సరైన కాపీలను అందజేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ క్రమంలో ఈరోజు కేసును రౌస్ అవెన్యూ కోర్టు విచారించబోతోంది. కవిత, కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా తదితరులకు కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది.

ఇది కూడా చూడండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!

2022 నవంబర్ 26న లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న సమీర్ మహేంద్ర అతడికి సంబంధించిన నాలుగు కంపెనీలపై మొదటిసారిగా ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగిన అవకతవకలు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలను ఈడీ పేర్కొంది. ఇందులో కవిత పేరును కూడా ప్రస్తావించింది. ఆ తర్వాత డిసెంబర్‌లో కూడా కవిత మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో సమీర్ మహేంద్రపైన ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో కీలక విషయాలు వెల్లడించింది. మరోసారి కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఛార్జీషీటులో ప్రస్తావించింది.

ఇది కూడా చూడండి: సల్మాన్‌ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్

సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్‌లో కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు మాగుంట రాఘవరెడ్డి, మూత్తం గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్ రావు పేర్లు కూడా ఉన్నాయి. సమీర్‌కు చెందిన ఇండో స్పిరిట్స్‌ కంపెనీలో కవితకు 32 శాతం వాటా ఉన్నట్లు ఈడీ అభియోగం మోపింది. ఎల్‌-1 లైసైన్స్ కింద వచ్చిన షాపుల్లో కవితకు ఈ వాటా ఉందని తెలిపింది. ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన మీటింగ్‌లో కవిత, అరుణ్‌ పిళ్లై, దినేష్‌ అరోరా, విజయ్‌నాయర్‌ పాల్గొన్నట్లు చెప్పింది. ఇండో స్పిరిట్‌ను కవిత వెనకుండి నడిపించారని.. ఈ కంపెనీలో నిజమైన భాగస్వాములు కవిత, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి అని ఈడీ చార్జ్‌షీట్‌లో వెల్లడించింది.

ఇది కూడా చూడండి: TN: గవర్నర్‌‌ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్

#mlc-kavitha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe