ఎన్నికల శంఖారావం.. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు: కవిత బోధన్ బూత్ కార్యకర్తల సమావేశంలో ఎమ్యెల్సీ కవిత రాహుల్ గాంధీపై హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన క్రమంలో 40 ఎలుకలు చచ్చాక ఒక్క పిల్లి వచ్చిందని కవిత కామెంట్స్ చేశారు. By Vijaya Nimma 16 Aug 2023 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి MLC Kavitha in Nizamabad: శంఖారావం ప్రారంభం నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరైయ్యారు. అంతకుముందు బోధన్ ఏఆర్ఆర్ గార్డెన్ నుంచి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ పాదయాత్రగా వచ్చి వచ్చారు. బోధన్ నియోజకవర్గానికి చెందిన 10వేల మంది కార్యకర్తలు హాజరయ్యేలా ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. ఇందు కోసం బోధన్‌లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. బీఆర్‌ఎస్ అంటే మన ఇంటి పార్టీ నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్‌ఎస్‌ఎఫ్ మైదానంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతు బీఆర్‌ఎస్ అంటే మన ఇంటి పార్టీ అని అన్నారు. మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధం అని వివరించారు. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడని పేర్కొన్నారు. బోధన్ ఎన్‌ఎస్‌ఎఫ్ మైదానంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొని ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. Your browser does not support the video tag. గులాబీ జెండా ఉత్సాహం అనంతరం కవిత మాట్లాడుతూ గులాబీ జెండా ఉత్సాహాన్ని బోధన్ ప్రజలు మరోసారి చూపించారని వ్యాఖ్యానించారు. మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు ఆమె సూచించారు. తెలంగాణలో ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనం నిర్మించుకున్నామని అన్నారు. బోధన్‌లో 10వేల బీడీ కార్మికులకు ఉన్నారు. వారి అందరికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. అంతేకాకుండా బోధన్ పట్టణంలో మొత్తం 152 చెరువులను బాగు చేసుకున్నామని తెలిపారు. నిజామాబాద్‌కు ఐటీ హబ్ తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇక్కడికి గూగుల్, ఇన్ఫోసిస్ కంపెనీలను కూడా తీసుకొస్తామని తెలిపారు. Your browser does not support the video tag. మోసపోవద్దు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్ర ప్రజలకు రూ.4వేల పెన్షన్ ఇస్తామని రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4వేల పెన్షన్ ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే కవిత ప్రజలకు సూచనలు చేశారు. Your browser does not support the video tag. Also Read: తెలంగాణ అసెంబ్లీ బరిలో శివసేన ..!! #mlc-kavitha #nizamabad-district #mlc-kavitha-in-nizamabad #tour-in-bodan #election-shankharavam #mlc-kavith-in-bodhan #booth-level-meeting-in-bodhan #mlc-kavitha-nizamabad-tour #brs-booth-committees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి