BIG BREAKING: తీహార్ జైలు నుంచి కవిత విడుదల ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవితకు ఈ రోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. By Nikhil 27 Aug 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha Released From Tihar Jail: ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితకు ఈ రోజు ఉదయం ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 166 రోజుల జైలు జీవితం అనంతరం కవిత విడుదలయ్యారు. కవిత అన్న కేటీఆర్, హరీశ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు తీహార్ జైలు వద్దకు వెళ్లి ఘన స్వాగతం పలికారు. ఈ రోజు రాత్రి కవిత ఢిల్లీలోనే ఉండనున్నారు. అనంతరం రేపు ఉదయం ఢిల్లీలో ప్రెస్ తో మాట్లాడే అవకాశం ఉంది. అనంతరం రేపు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి తండ్రి కేసీఆర్ ను కవిత కలిసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. #mlc-kavitha #tihar-jail #delhi-liquor-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి