మెట్‌పల్లిలో ఎమ్మెల్సీ కవిత శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తన పెద్దరికాన్ని మరిచి బతుకమ్మపై కామెంట్స్ చేశారు. నన్ను క్వీన్ ఎలిజిబెత్ రాణి అని మాట్లాడి ఆయన పెద్దరికాన్ని కోల్పోయారని మండిపడ్డారు. జీవన్‌రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలి.. నేను మీ ఇటలీ రాణిని కాదు.. మీ ఇటలీ రాని లెక్క నేను వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను నేను బలి తీసుకోలేదని కవిత అన్నారు. మీరు దిగజారిపోయి.. హోదాను మరిచిపోయి.. తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానించినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతున్నాను కవిత చెప్పారు.
బతుకమ్మ మీద గౌరమ్మ బదులు ఇంకేదో పెట్టుకుని పండగ చేసుకుంటామని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన వయస్సు ఏంది..? ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంది..? ఆయన స్థాయి, గౌరవం ఏంది..? ఒక్క ఎన్నిక గెలవడానికి ఇంత దిగజారి మాట్లాడతారా..? ఇంత అవమానం చేస్తారా..? అని కవిత ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో నిర్బంధం ఉన్న కాలంలో ఆడబిడ్డలు సగర్వంగా ఆత్మ గౌరవానికి ప్రతీక అని నెత్తిమీద పెట్టుకుని మోసినటువంటి బతుకమ్మను అవమానించిన జీవన్‌రెడ్డిని పక్కన పెట్టుకొని రాహుల్‌గాంధీ జగిత్యాలలో ముచ్చట్లు చెప్పారని కవిత ఆరోపించారు.
This browser does not support the video element.
ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే.. ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత అని కవిత ఆరోపించారు. సీఎం కేసీఆర్ చావు నోట్లో తల పెడితే 2009లో తెలంగాణ ఏర్పాటును ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకుంటే వందలాదిమంది బిడ్డల చావులకు సోనియాగాంధీ కారణమయ్యారని కవిత ఫైర్ అయ్యారు. రాహుల్‌గాంధీ కాదు.. ఎలక్షన్ గాంధీ. ఎన్నికలు రాగానే అనుబంధము, కుటుంబమని చెబుతున్నారని రాహుల్‌పై కవిత సెటైర్లు వేశారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినప్పుడు, హైకోర్టు కావాలని మేము పార్లమెంట్‌లో పోరాటం చేసినాడు, విభజన హామీల్లో ఒక్క హామీని కూడా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చకపోతే, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోతే, రాహుల్ గాంధీ ఎక్కడున్నారు..? ఎందుకు మాట్లాడలేదు..? అని రాహుల్‌గాంధీని కవిత ప్రశ్నించారు.
This browser does not support the video element.
పార్లమెంట్‌లో తెలంగాణను నరేంద్ర మోదీ అవమానం చేసినప్పుడు రాహుల్‌గాంధీ- సోనియాగాంధీ సభలోనే ఉన్నా కూడా అభ్యంతరం చెప్పలేదని కవిత మండిపడ్డారు. ఇటువంటి రాహుల్‌గాంధీ మనకు కావాలా..? లేదా కేసీఆర్ కావాలో..? ప్రజలు గుర్తించాలని కవిత కోరారు. మంథనిలో దొర అయిన శ్రీధర్ బాబును పక్కన పెట్టుకొని రాహుల్‌గాంధీ అలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు దళిత బిడ్డ కవ్వంపల్లి సత్యనారాయణకు మాట్లాడే అవకాశం ఉండదు కానీ.. శ్రీధర్ బాబు మాత్రం మాట్లాడారని, రాహుల్ ప్రసంగాన్ని తర్జుమా చేయడానికి దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్‌ను కాకుండా జీవన్‌రెడ్డికి ఎలా అవకాశం ఇచ్చారని కవిత రాహుల్‌పై సెటైర్ల వేశారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో భారీగా చేరికలు..ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి కాషాయ కండువాలు