/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/MLC-Kavitha-Dance-jpg.webp)
MLC Kavitha Dance: 'గులాబీల జెండలే రామక్క'.. ఎక్కడ విన్న ఇదే పాట రీసౌండ్ చేస్తోంది తెలంగాణలో. ఏ ముహూర్తాన ఈ పాటను బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసిందో గానీ.. తెలంగాణ ఎన్నికల్లో(Telangana Elections) దుమ్మురేపుతోంది. ఈ పాట వస్తే చాలు పూనకాలు లోడింగ్ అన్నట్లుగా.. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) క్షేత్రస్థాయి కార్యకర్త మొదలు.. టాప్ లీడర్ల వరకు ఎగిరి గంతేస్తున్నారు. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. తమ నాయకులతో కలిసి గులాబీల జెండలమ్మ పాటకు స్టేజి మీదనే డ్యాన్స్ వేసి అదరగొట్టారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత దుమ్మురేపారు.
Mood at Mortad, Balkonda today!
Happiness is spending time with my people 🩷#KCROnceAgain #VoteForCar#JaiTelangana pic.twitter.com/qslT3iI6J9— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 15, 2023
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. మంత్రి నిరంజన్ రెడ్డికి మద్ధతుగా బాల్కొండ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సభకు హాజరైన పార్టీ కార్యకర్తలు, ప్రజలతో కలిసి గులాబీ జెండలమ్మ (Gulabila Jandalamma) పాటకు మాస్ స్టెప్పులేశారు ఎమ్మెల్సీ కవిత. బతుకమ్మ పాటకు కవితమ్మ ఆటను మాత్రమే చూసిన జనాలు.. ఇప్పుడు ఈ గులాబీ జెండలమ్మ పాటకు కవిత మాస్ డ్యాన్స్ చూసి అబ్బురపడిపోయారు. పాటకు తగ్గట్లుగా అడుగులు వేస్తూ అలరించారు కవిత. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కవిత డ్యాన్స్ వీడియోను చూసిన బీఆర్ఎస్ శ్రేణులు తగ్గేదేలే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కేవలం ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కోరుకుంటాయి, బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రజలు గెలవాలని, ప్రజల బతుకులు బాగుపడాలని కోరుతుంది.
బాల్కొండను బంగారుకొండలా అభివృద్ధి చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుందాం. @VPR_BRS #KCROnceAgain #VoteForCar… pic.twitter.com/wsljm9A010— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 15, 2023
కాగా, బాల్కొండ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలుచేశారు. ఈ రెండు పార్టీలు కేవలం ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాయని, బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రజలు గెలవాలని, ప్రజల బతుకులు బాగుపడాలని కోరుతోందన్నారు. బాల్కొండను బంగారుకొండలా అభివృద్ధి చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్సీ కవిత.
Also Read:
మోకాళ్లు, కీళ్ల నుంచి సౌండ్ వస్తోందా? కారణమిదేనట..!
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా? వివరాలు మీకోసం..