MLC Kavitha Arrested - Delhi Liquor Policy Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవితను ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేసేందుకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ లోని ఆమె నివాసంలో తనిఖీలు చేసిన అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితను ఢిల్లీకి తీసుకెళ్లి తదుపరి విచారణను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.
కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత...
ఎమ్మెల్సీ కవిత నివాసం వద్దకు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో వారు అక్కడ ఆందోళనకు దిగారు. లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ని దెబ్బ తీసేందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. కవితను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అక్కడ పరిస్థితి అదుపు చేసేందుకు పోలీస్ బలగాలు భారీగా చేరుకున్నాయి.
మాకు సమాచారం లేదు..
కవిత అరెస్ట్ పై స్పందించారు బీఆర్ఎస్ లీగల్ సెల్ హెడ్ సోమా భారత్. కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయనున్నట్టు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని అన్నారు. దీనిపై తాము లీగల్ యాక్షన్ తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే.. లిక్కర్ స్కాం కేసులో మరికొంత మంది బీఆర్ఎస్ నేతలకు ఈడీ నోటీసులు ఇవ్వనున్నట్లుం సమాచారం అందుతోంది.
MLC Kavitha Arrest Warrant:
Also Read: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే, మాజీ మంత్రి!