Delhi: నేడు ఢిల్లీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నేడు జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి షి ద లీడర్‌ విమెన్‌ ఇన్‌ ఇండియాన్‌ పాలిటిక్స్‌ పుస్తకావిష్కరణలో కవిత పాల్గొననున్నారు.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్
New Update

పుస్తకావిష్కరణ

తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రముఖ జర్నలిస్టు నిధి శర్మ దేశంలోని ముఖ్యమైన మహిళ నాయకురాళ్లపై రచించిన షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి మనీష్ తివారి, సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్‌తో కలిసి కవిత ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.

బీజేపీ మాట్లాడినవన్నీ అబద్దాలే

ఇక నిన్న బీజేపీపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అర‌వింద్‌ అన్ పార్లమెంట‌రీ భాష మాట్లాడుతున్నార‌ని క‌విత ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్‌లో 2 ల‌క్ష‌ల 77 వేల పెన్ష‌న్లకు రూ. 4 వేల కోట్లు బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఖ‌ర్చు పెట్టిందన్నారు. 2 ల‌క్ష‌ల 59 వేల మంది రైతుల‌కు రూ. 2616 కోట్ల వరకు రైతుబంధు ఇచ్చాం. 4700 మంది రైతులు చ‌నిపోతే రూ. 239 కోట్లు రైతుబీమా ఇచ్చాం. రూ. 2800 కోట్లు రుణ‌మాఫీ చేశాం. 77 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని పండించ‌గ‌లిగింది. దీనికి రూ. 13 వేల కోట్లు ప్ర‌భుత్వం చెల్లిస్తే.. వీట‌న్నింటిలో బీజేపీ కంట్రిబ్యూష‌న్ ఏముంది..? అని కవిత నిలదీశారు . నిజామాబాద్‌కు ఇది కావాల‌ని పార్ల‌మెంట్‌లో ఒక్క‌నాడు కూడా ఎంపీ మాట్లాడ‌లేదు..కానీ పాలిటిక్స్ మాత్రం మాట్లాడుతారని అరవింత్‌ ఫైర్‌ అయ్యారు. ఒక్క‌సారి కూడా తెలంగాణ హ‌క్కుల గురించి మాట్లాడ‌లేదు. గ్రామీణ ప్రాంతాల పిల్ల‌ల‌కు ఐటీ జాబ్స్ వ‌స్తే ఎందుకంత క‌డుపుమంట‌. పిల్ల‌లు ఎప్పుడు మీ వెనుకాల జెండాలు ప‌ట్టుకొని తిర‌గలా..? అని అంటూ.. ఉద్యోగాల కల్పనపై అరవింద్ మాట్లాడినవన్నీ అబద్దాలేనంటూ కవిత పేర్కొన్న విషయం తెలిసిందే.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం

రెండు నెలల క్రితం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన దీక్ష చేపట్టిన విషయం తెసిందే. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి, ఆమోదింపజేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి తరపున ఆమె ఒక్క రోజు దీక్ష తలపెట్టిన సంగతి తెలిసిందే. దీక్ష కోసం ఢిల్లీకి వెళ్లిన కవిత..నేడు మరో కార్యక్రమంలో పాల్గొనున్నారు.

#mlc-kalvakuntla-kavitha #delhi #she-the-leader-women-in-indian-politics-book-launch-event
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe