MLC Elections: అద్దంకి దయాకర్ కు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అడ్డంకి దయాకర్ కు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ లిస్టులో మహేశ్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు రేపు తుది గడువు. By V.J Reddy 17 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Addanki Dayakar: అద్దంకి దయాకర్ కు అడుగడునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా అద్దంకికి షాక్ ఇచ్చింది కాంగ్రెస్ (Congress) హైకమాండ్. ఈ నెల 29న జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు అద్దంకి దయాకర్ పేరును కాంగ్రెస్ ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అందరు కూడా అద్దంకికి ఎమ్మెల్సీ పదవి రాబోతుందని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. జరుగుతున్న చర్చలకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ లో (MLC List) నుంచి తీసేసింది. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ లిస్టులో మహేష్ కుమార్ గౌడ్ (Bomma Mahesh Kumar Goud) , బల్మూరి వెంకట్ (Balmoor Venkat narsing) పేర్లను అధికారికంగా ప్రకటించింది. అద్దంకి దయాకర్ బదులుగా మహేష్ కుమార్ గౌడ్ పేరును చేర్చింది. దీంతో ఎమ్మెల్సీ అవుతానని కోటి ఆశలతో ఉన్న అద్దంకి దయాకర్ కు ఈసారి కూడా అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు రేపు తుది గడువు. Also Read: కళేబరాలతో కల్తీ నూనె… బయటపెట్టిన ఆర్టీవీ అద్దంకికి దెబ్బ మీద దెబ్బ.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది. తుంగతుర్తి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ ను కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించింది. ఆయన స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మందుల సామేల్ కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డారు అద్దంకి దయాకర్. ఎమ్మెల్యే టికెట్ కాకుండా తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచి పదవి ఇస్తామని గతంలో కాంగ్రెస్ అధిష్టానం అద్దంకి దయాకర్ ను ఢిల్లీకి పిలిపించుకొని హామీ ఇచ్చింది. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పై ఘన విజయం సాధించింది తెలంగాణ గడ్డపై మూడు రంగుల జెండాను ఎగరవేసింది. తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మందుల సామేల్ 50వేల మెజారితో గెలుపొందారు. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ పగ్గాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్.. అద్దంకి దయాకర్ కు ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి అద్దంకి దయాకర్ కు కేటాయిస్తుందనే చర్చ జరిగింది. ఎమ్మెల్సీ పదవితో అద్దంకిని మంత్రిని కూడా చేస్తుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో అద్దంకి దయాకర్ పేరును ప్రకటించకపోవడంపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. #telangana-congress #addanki-dayakar #mlc-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి