కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమవతోంది. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దారెటు అనే దానిపై గత కొన్నిరోజులుగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే సీఎం జగన్.. ఈసారి వసంత కృష్ణప్రసాద్‌ను కాదని, మైలవరం వైసీపీ ఇంఛార్జిగా తిరుపతి యాదవ్‌ను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో అసంతృప్తి చెందిన వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
Also Read: దూకుడు పెంచిన టీడీపీ, జనసేన.. మరోసారి సమావేశం కానున్న పవన్, చంద్రబాబు..
టీడీపీ అభ్యర్థిగా వసంత పోటీ..?
మరోవైపు టీడీపీ అధిష్ఠానం నుంచి కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈరోజు వసంత కృష్ణప్రసాద్ ముఖ్యనేతలో సమావేశం కానున్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై మీడియా సమావేశం నిర్వహిస్తారు. అయితే మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత పోటీ చేస్తారని జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఇక దేవినేని ఉమను పెనమలూరు పంపిస్తారని.. పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే వసంత రాకను దేవినేని ఉమా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మైలవరం టికెట్ ఎవరికి ?
వసంతకృష్ణ వ్యాపారాల కోసమే పార్టీలు మారుతున్నారని.. దేవినేని ఉమ తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి వాళ్లను వ్యతిరేకించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్, టీడీపీ నుంచి దేవినేని ఉమా పోటీ పడగా.. వసంత గెలిచారు. అయితే ఈసారి కూడా మైలవరం టికెట్ దేవినేని ఉమా కోరుతున్నారు. మరోవైపు వసంత కూడా టీడీపీలోకి వస్తే.. ఈ టికెట్ కావాలనే అడిగే ఛాన్స్ ఉంది. దీంతో మైలవరం నియోజవర్గంలో టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
Also Read: ప్రారంభం అయిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు..