Prakash Goud: మరో బీఆర్ఎస్ వికెట్ ఔట్.. కాంగ్రెస్‌లోకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే! కేసీఆర్ కు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 31కి పడిపోనుంది. By srinivas 11 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS MLA Prakash Goud: కేసీఆర్ కు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రేపు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో (Congress) చేరనున్నారు. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే?? సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రేపు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం. https://t.co/qBAVYxNnAf pic.twitter.com/SYqxh6iy5J — Telugu Scribe (@TeluguScribe) April 19, 2024 ఈ మేరకు ప్రకాష్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్‌లోకి ఇద్దరు మున్సిపల్ ఛైర్మన్లు చేరనున్నారు. ఇప్పటివరూ ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ గౌడ్ తో ఫిరాయింపు ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరనుంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 31కి పడిపోనుంది. అయితే గతంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్ ఇంతకాలం కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే వార్తలను ఖండించారు. ఇక ఇటీవల హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబుతో ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ప్రకాశ్ గౌడ్ మిత్రుడు అనే సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ టీడీపీలో కలిసి పని చేశారు. 2009, 2014లో టీడీపీ నుంచి ప్రకాశ్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు ప్రకాశ్ గౌడ్. #congress #brs #mla-prakash-goud మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి