Lasya Nanditha Death: ఎమ్మెల్యే లాస్య నందిత కేసులో ట్విస్ట్..టిప్పర్ డ్రైవర్ అరెస్ట్

హైదరాబాద్‌ ఓఆర్ఆర్ లో ఎమ్మెల్యే లాస్య నందిత కారు యాక్సిడెంట్ వెనుక కారణాలను ఛేదించారు పోలీసులు. ఎమ్మెల్యే లాస్య కారును వెనుక నుంచి ఓ లారీ టిప్పర్ గుద్దడం వలనే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. ఆ టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Lasya Nanditha Death: ఎమ్మెల్యే లాస్య నందిత కేసులో ట్విస్ట్..టిప్పర్ డ్రైవర్ అరెస్ట్
New Update

Twist in Lasya Nanditha Accident: టిప్పర్ లారీ ఢీకొట్టడం వల్లనే ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదానికి గురైందని పోలీసులు గుర్తించారు. టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు. ఓఆర్ఆర్ (ORR) మీదకి ఎంట్రీ అయిన సమయంలో లాస్య నందిత కారుతో పాటూ వెళుతున్న లారీలను సీసీ కెమెరాల్లో గుర్తించారు. ముందు వెళుతున్న టిప్పర్‌ లారీని లాస్య నందిత కారు బలంగా ఢీకొట్టింది. ఆ తరువాత 100 మీటర్ల దూరం వెళ్ళి అక్కడ ఒఆర్ఆర్ సైడ్ రేలింగ్‌ని గుద్దుకుని ఆగిపోయింది. లారీని ఢీకొట్టడం వల్లనే కారు ముందు భాగం బాగా దెబ్బ తింది. లాస్య నందిత ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ కూర్చుని ఉన్నారు.

ప్రమాదం గురించి దర్యాప్తు...

ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) ప్రమాదం మీద వివరాలను సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పటాన్ చెరు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రమాదం జరిగినప్పటి ఆధారాలను సేకరించారు. లాస్య ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు? ఏ రూట్లో ప్రయానించారు లాంటి ఆధారాలన్నీ సేకరించారు. ఇందులో టిప్పర్ లారీ విషయం బయటపడింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడిక్కడే మరణించగా...డ్రైవర్ ఆకాష్ కొన ఊపిరితో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్ డ్రైవర్ ఆపకుండా వెళ్ళిపోయాడు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా లారీని పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చిన్న వయసులోనే...

గత నెల 23వ తేదీన సికింద్రాబాద్(Secunderabad) కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం(Road Accident) లో మృతి చెందారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై ఆమె ప్రయాణిస్తున్న XL6 కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులోని ఎయిర్‌ బెలూన్స్ ఓపెన్‌ కాకపోవడం, లాస్య తల ముందు సీటుకు బలంగా తగలడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. లాస్య నందిత వయసు 33 సంవత్సరాలు. ఈమె దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న చిన్న కూతురు.

Also Read:Jobs: నిరుద్యోగులకు శుభవార్త..61,960 జీతంలో గవర్నమెంట్ జాబ్

#telangana #hyderabad #lasya-nanditha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe