Kotamreddy Sridhar Reddy Inspected The Ganesh Ghat Areas : నెల్లూరు (Nellore) రూరల్ లో గణేష్ ఘాట్ ప్రాంతాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే కోటంరెడ్డి (Kotamreddy Sridhar Reddy) పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ లో గణేష్ ఘాట్ (Ganesh Ghat) ఏర్పాటు తన ఆకాంక్ష, తన కల అన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గణేష్ ప్రతిమ (Ganesh Idols) లను 11వ తేది నిమజ్జనం చేయాలన్నారు.
Also Read: అచ్యుతాపురం సెజ్ లో పేలిన రియాక్టర్.. నలుగురు కార్మికుల మృతి..!
గణేష్ ఘాట్ ఆధునికరణకు నిధులను మంజూరు చేసిన మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. సింగిల్ విండో పద్దతి ద్వారా మున్సిపల్, పోలీస్, ఫైర్, కరెంటు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కాలుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్వాహకులు అన్ని అనుమతులు తీసుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాల్లో అస్లీల, అసభ్యకర కార్యక్రమాలు నిర్వహించకుండా నిర్వాహకులు నిబంధనలు పెట్టుకోవాలని హెచ్చరించారు.