AP: గణేష్ ఘాట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి!
నెల్లూరు రూరల్‌లో గణేష్ ఘాట్ ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాల్లో అసభ్యకర కార్యక్రమాలు నిర్వహించకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు
AP News: టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. నిధుల దుర్వినియోగంపై సీరియస్!
టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారని, నిధులు దుర్వినియోగం చేసేవారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరించారు. ప్రజల శ్రేయస్సు కోసమే చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు.
AP: నెల్లూరులో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కోటంరెడ్డి V/S పోలీస్..!
నెల్లూరు కార్పొరేషన్ ఆఫీసులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యే కార్పొరేషన్ ఆఫీసులోకి వెళుతుండగా..ఆయన వెంట ఉన్న కార్పొరేటర్లను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.
Kotamreddy: జగన్ తోనే పోరాటానికి దిగిన నేను ఇలా చేయడం పెద్ద విషయం కాదు: కోటంరెడ్డి
ఈ గెలుపు తనకు ఒక అపూర్వ విజయం అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎమ్మెల్యే అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలి అనే విధంగా నడుచుకుంటానన్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కక్షసాధింపు చర్యలు, వేధింపులకు గురిచేయవద్దని కార్యకర్తలను హెచ్చరించారు.
Kotam Reddy: దమ్ముంటే ఇలా పోటీ చేయండి.. విజయసాయిరెడ్డికి కోటంరెడ్డి సవాల్..!
అధికార పార్టీకి చెందిన వారు ఉచ్చ నీచాలు మరిచి విమర్శలు చేస్తున్నారన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెట్టి మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. విజయసాయి రెడ్డికి గెలుస్తాననే నమ్మకం ఉంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు.
కోటంరెడ్డి గెలుపే లక్ష్యంగా.. సతీమణి, కుమార్తెల ఇంటింటి ప్రచారం!
నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి సుజితమ్మ, కుమార్తెలు హైందవి, వైష్ణవి ఇంటింటికీ తిరుగుతూ శ్రీధర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.
ఈసారి కూడా నాకు అవకాశం కల్పించండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. వైసీపీ నుంచి తాను దూరంగా జరిగి తెలుగు దేశం పార్టీలోకి ఎందుకు చేరాలో స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఇప్పటికే తనపై నమ్మకంతో రెండు సార్లు గెలిపించారని ఇందుకు రుణపడి ఉంటానన్నారు. గెలిచినప్పటి నుంచి నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/mla-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kotamreddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/U4u4Q4owKKg-HD-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kotamreddy-sridhar-reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Kotamreddy-election-campaign--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/564-jpg.webp)