MLA Kotamreddy: టీడీపీ నేతల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా నేత విజితరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవటంతో, జగన్ రెడ్డి పిచ్చి పీక్స్ కి వెళ్ళిందని అందుకే కక్షసాధిస్తున్నాడని ఫైర్ అయ్యారు. By Jyoshna Sappogula 04 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేపట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా నేత విజితరెడ్డి ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. అనధికారిక నగదు దాచి ఉన్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. విజితారెడ్డి ఇంటికి చేరుకున్నారు. పోలీసులు నిర్వహించిన దాడులపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: లంచం కేసుల్లో ఎంపీలు,ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవటంతో, జగన్ రెడ్డి పిచ్చి పీక్స్ కి వెళ్ళిందని మండిపడ్డారు. పోలీసులను ఉపయోగించుకుని టీడీపీ నేతలపై కక్షసాధింపు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. టీడీపీ మహిళా నేత విజితరెడ్డి ఇంటిపై పోలీసులు దాడులు చేసి, ఇంటిని చుట్టుముట్టి హంగామా చేసారని.. ఎన్నికలకు డబ్బులు దాచారంటూ, ఇంట్లోని బీరువా, వస్తువులను చిందరవందర చేసారని ధ్వజమెత్తారు. Also Read: బాలీవుడ్ ఖాన్స్ తో రామ్ చరణ్ నాటు..నాటు స్టెప్స్..అంబానీ వేడుకల్లో మాస్ రచ్చ! ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నువ్వెన్ని చేసినా, ఎన్నికల లోపే, ఒక్కో జిల్లాలో నిన్ను ఖాళీ చేస్తాం, ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాగా, వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీపై అసహనం వ్యక్తం టీడీపీలోకి చేరారు. ప్రస్తుతం నెల్లూరులో టీడీపీ గెలుపుకోసం కృష్టి చేస్తున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. #andhra-pradesh #mla-kotamreddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి