ఈసారి కూడా నాకు అవకాశం కల్పించండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. వైసీపీ నుంచి తాను దూరంగా జరిగి తెలుగు దేశం పార్టీలోకి ఎందుకు చేరాలో స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఇప్పటికే తనపై నమ్మకంతో రెండు సార్లు గెలిపించారని ఇందుకు రుణపడి ఉంటానన్నారు. గెలిచినప్పటి నుంచి నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. By E. Chinni 08 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ Scrolling New Update షేర్ చేయండి రాబోయే ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లకందుకూరు గ్రామంలో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. వైసీపీ నుంచి తాను దూరంగా జరిగి తెలుగు దేశం పార్టీలోకి ఎందుకు చేరాలో స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఇప్పటికే తనపై నమ్మకంతో రెండు సార్లు గెలిపించారని ఇందుకు రుణపడి ఉంటానన్నారు. గెలిచినప్పటి నుంచి నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభంజనం తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మమతా రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, తోట శోభారాణి తదితరులు పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ చార్జ్ గా చంద్రబాబు నియమించారు. ఇకపై కోటంరెడ్డి ఆధ్వర్యంలోనే నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో టీడీపీ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు కార్యకర్తలు, నేతలు కోటంరెడ్డికి సహకరించాలని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైస్సార్సీపీ నుంచి గత ఎన్నికల్లో ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఆపార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈక్రమంలో ఆయన టీడీపీకి దగ్గరవ్వడం.. ఆ తర్వాత పార్టీలో చేరడం జరిగాయి. #kotamreddy-sridhar-reddy #mla-kotamreddy-sridhar-reddy #nellore-rural-mla-kotamreddy-sridhar-reddy #upcoming-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి