Harish Rao: ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. హరీష్ రావు ఫైర్ TG: కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్నాలు చేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదని హరీష్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మోతీలాల్ నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. ప్రజా పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. By V.J Reddy 30 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Harish Rao: గ్రూప్స్, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను (Motilal Naik) పరామర్శించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని అన్నారు. అసెంబ్లీని స్తంభింప చేస్తాం అని హెచ్చరించారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్ తో మాట్లాడాలి, వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. హరీష్ రావు కామెంట్స్.. * ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చ జరపాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. * ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా నిరుద్యోగులు తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. ఎంతవరకైనా తెగించి కొట్లాడుతుంది. * నిరుద్యోగ యువతీ యువకులకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుంది. * మోతిలాల్ నాయక్ దీక్ష విరమించాలని మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కలిసి ప్రభుత్వంపై పోరాటం చేద్దామని పిలుపునిస్తున్నాను. * మోతీలాల్ కు ఏం జరగక ముందే ప్రభుత్వం తక్షణంగా స్పందించాలి. అతని ఆరోగ్యం పట్ల ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. * కోదండరాం గారు పిల్లల హక్కుల పట్ల పూర్తి బాధ్యత తీసుకోవాలి. అమలు చేసే విధంగా ముందుకు రావాలి. * మోతీలాల్ నాయక్ ఏడు రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేకపోవడం దురదృష్టకరం. * మోతిలాల్ దీక్ష విరమించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కలిసి కోరాం. * ఇది నా ఒక్కడి పోరాటం కాదు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న అన్నడు. ప్రభుత్వం దిగివచ్చేదాకా దీక్ష విరమించెను అని చెప్పిండు. * పదేపదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేసాం, అందరం కలిసి పోరాటం చేద్దాం, మేము మీ వెంట ఉన్నాం, ప్రాణం ముఖ్యం, తండ్రి లేని వాడివి అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. * కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపెట్టి నిరుద్యోగులను వాడుకొని వదిలిపెట్టారు. ఎన్నికలు అయిపోయాక నిరుద్యోగుల గుండెల మీద తన్నుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. * ఓడదాటే దాకా ఓడ మలన్న ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉంది. Also Read: చంద్రబాబుతో ఉన్న పాత ఫోటోను షేర్ చేసిన మోదీ #harish-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి