/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Harish-Rao.jpg)
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వానికి పరిపాలన చేతకావట్లేదని అన్నారు. ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని ఫైర్ అయ్యారు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలే జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై కేసులు, కుట్రలు తప్పా పాలన చేతకావట్లేదని చురకలు అంటించారు. రాష్ట్రంలో రైతు బంధుకు (Rythu Bandhu Scheme) దిక్కేలేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ (KCR) హయాంలో జూన్‌లోనే రైతు బంధు వచ్చేదని గుర్తు చేశారు. గీతలు, కోతలు పెడతామనేదే ప్రభుత్వ ఆలోచన అని అన్నారు.
Also Read: త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి