Hyderabad: పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్..కన్నీళ్లు పెట్టుకున్న మహిపాల్!

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ నిబంధనలకు విరుద్ధంగా నడిపాడనే కేసులో పఠాన్ చెరు మండలం లక్డారంలో ఉన్న క్వారీని అధికారులు సీజ్ చేశారు. తమ్ముడి అరెస్టుతో మహిపాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

New Update
Hyderabad: పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్..కన్నీళ్లు పెట్టుకున్న మహిపాల్!

Mahipal Reddy: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో మధుసూదన్ రెడ్డిని పటాన్ చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామునే గూడెం మధు ఇంటికి చేరుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేసి పటాన్ చెరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇటీవల మధుసూదన్ రెడ్డి కుమారుడి పేరిట పఠాన్ చెరు మండలం లక్డారంలో ఉన్న క్వారీని అధికారులు సీజ్ చేశారు. కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లగించి పరిమితికి మించి తవ్వకాలు జరపడం.. లీజు గడువు ముగిసినా మైనింగ్ చేయడంపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

కన్నీరు పెట్టిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..
సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో తమ్ముడు మధుసూదన్‌రెడ్డి అరెస్ట్‌పై పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పందించారు. శుక్రవారం మాజీ మంత్రి హరీష్‌రావుతో కలిసి మహిపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్ముడి అరెస్ట్ పట్ల తీవ్ర భావోద్వేగానికి గురవుతూ ఎమ్మెల్యే కన్నీరుపెట్టుకున్నారు.శుక్రవారం మాజీ మంత్రి హరీష్‌రావుతో కలిసి మహిపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్ముడి అరెస్ట్ పట్ల తీవ్ర భావోద్వేగానికి గురవుతూ ఎమ్మెల్యే కన్నీరుపెట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో లక్డారం క్వారీ అనుమతులు తీసుకున్నామని.. క్వారీని గతంలోనే లీజుకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత నాలుగేళ్లుగా తమ సోదరుడు మధుసూదన్ రెడ్డి చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు గడవక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురిచేయటం జరుగుతుందని మండిపడ్డారు. తాము తప్పు చేస్తే పెనాల్టీ వేయాలని.. నోటీసు ఇవ్వాలని.. అంతేకాని తెల్లవారుజామున 3 గంటలకు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయటం చట్ట విరుద్ధమన్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad: మల్కాజ్ గిరిలో మోడీ రోడ్ షో.. పోటెత్తిన జనం..!

మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అక్రమం: హరీష్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా పనిచేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోనికి టీఆర్ఎస్ నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ఒప్పుకోక పోతే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయటం అక్రమమన్నారు. అరెస్టు చేసేటప్పుడు ప్రొసిజర్ ఉంటుందని.. ప్రజాస్వామ్య రహితంగా అరెస్టు చేయటం ఘోరమన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు