Danam Nagender: త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.నేడు కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాసరెడ్డి చేరడంతో దానం ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విధానాలే ఆ పార్టీ కొంపముంచాయని దానం ఎద్దేవా చేశారు.
అతి త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉందని దానం అన్నారు. రాష్ట్రంలో చాలా మంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారని దానం అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని వివరించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలైన పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్‌లు తప్ప మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు కొందరు బీజేపీకి వెళ్లడానికి ట్రై చేస్తున్నారని వెల్లడించారు. అయోమయంలో పడిన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
Also read: క్రికెటర్ షమితో సానియా మీర్జా పెళ్లి..అసలు విషయం ఏంటంటే!