Telangana: యాదాద్రికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: బీర్ల ఐలయ్య

యాదాద్రి లక్ష్మినరసింహ ఆలయంలో భక్తలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య అధికారును ఆదేశించారు. ఈ మేరకు ఆలయ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

New Update
Telangana: యాదాద్రికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: బీర్ల ఐలయ్య

యాదాద్రి లక్ష్మినరసింహ ఆలయంలో భక్తలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య అధికారును ఆదేశించారు. ఈ మేరకు ఆలయ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆలయం అభివృద్ధి, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విషయాలపై చర్చించారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చే భక్తులకు తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేయడంతో ఆలయ అధికారులకు ఐలయ్య అభినందనలు తెలిపారు. అలాగే మరికొన్ని చోట్ల మూత్రశాలలు ఏర్పాటు ఆదేశించారు.

Also Read: ఘోర అగ్నిప్రమాదం.. రూ.50 లక్షల ఆస్తి నష్టం

స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే వారికి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. డార్మెంటరీ హాల్‌లో పడుకునే వారి సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని..అన్నదాన సత్రంలో 1000 మంది భక్తులు భోజనం చేసే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే కొండపైన ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని..గూడురూ టోల్ గేట్ నుండి రాయగిరి కమాన్ వరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మెట్ల మార్గంపై సోలార్ షెడ్ నిర్మాణం చేసి నీటి సౌకర్యంతో పాటు,మూత్రశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

అలాగే ఆలయంలో సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని.. వారికి ఒక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలన్నారు. దీంతోపాటు యాదాద్రిలోని పలు కూడళ్లలో స్వామివారి పేర్లతో నామకరణం చేయాలని సూచించారు. భక్తులకు ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తే ఎక్కువమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్స్ ద్వారా ఆలయంలో జరిగే పూజలను ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే మీడియా వారికి మీడియా పాయింట్ కూడా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Also Read: కలరా కలకలం.. 80 మందికి సోకిన వ్యాధి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు