/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-52.jpg)
Tollywood : టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan). పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్నారు. షాక్, మిరపకాయ్ వంటి సూపట్ హిట్స్ తర్వాత హరీష్ శంకర్, రవితేజ కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. సీనియర్ నటుడు జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. ఇటీవలే 'సితార్' పేరుతో ఫస్ట్ సింగిల్ ప్రోమో వదిలారు.
ఈ ప్రోమో సాంగ్ పై అంచనాలు పెంచగా..నేడు ఫుల్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఫారిన్ లో ఉన్న అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ పాటకు సాహితి లిరిక్స్ అందించగా.. సాకేత్, సమీరా భరద్వాజ్ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రపీ చేశారు. తాజాగా రిలీజైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
A magical duet from the sitar strings to soothe your heartstrings 🪕❤️#SitarSong from #MrBachchan out now 🕺💃🏻
▶️ https://t.co/86OMlDbUgSA @MickeyJMeyer musical✨
Lyrics by #Sahithi ✍️
Sung by @SakethKomanduri & #SameeraBharadwaj 🎙️#MassReunion
Mass Maharaaj @RaviTeja_offl… pic.twitter.com/sQHvlXPRbh— People Media Factory (@peoplemediafcy) July 10, 2024
Also Read : బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. 15 మంది జంప్