/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-5-7-jpg.webp)
60 year old Alejandra Marisa Rodríguez: మిస్ యూనివర్స్ 2024 కిరీటాన్ని 60 ఏళ్ల మహిళ సొంతం చేసుకుంది. బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన ఈ వేడుకలో 'లా ప్లాటా'కు చెందిన 60 అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ విజేతగా నిలిచింది. లేటు వయసులోనూ తన అందచందాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉత్తేజపరిచిన ఆమె.. మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి 60 ఏళ్ల మహిళగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ కిరీటం ధరించిన అనంతరం మాట్లాడిన రోడ్రిగ్జ్. 'అందాల పోటీల్లో ఈ కొత్త నమూనాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నా' అంటూ మురిసిపోయింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
న్యాయవాది, పాత్రికేయురాలు..
వృత్తి రిత్యా న్యాయవాది, పాత్రికేయురాలు అయిన అలెజాండ్రా రోడ్రిగ్జ్ .. 'అందాల పోటీలలో ఈ కొత్త నమూనాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు నేను థ్రిల్డ్ అవుతున్నాను. ఎందుకంటే మేము ఒక కొత్త వేదికను ప్రారంభిస్తున్నాం. దీనిలో మహిళల శారీరక సౌందర్యం మాత్రమే కాదు.. మరొక విలువలను కలిగి ఉంటారు. నా విశ్వాసం నా తరం మహిళలకు ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నా' అన్నారు.
Alejandra Marisa Rodríguez broke stereotypes as she was crowned Miss Universe for the province of Buenos Aires at 60-years-old. pic.twitter.com/6PjPRrAFCf
— The Associated Press (@AP) April 26, 2024