Miss Shetty Mr Polishetty: అనుష్క చికెన్ కర్రీ.. ప్రభాస్ పలావ్.. అభిమానులకు పసందే..

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ప్రమోషన్‌లో భాగంగా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది హీరోయిన్ అనుష్క శెట్టి. ఈ సినిమాలో చెఫ్ అన్విత ర‌వళి శెట్టి క్యారెక్టర్‌లో నటించిన అనుష్క.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రెసిపీ ఛాలెంజ్ ప్రారంభించింది.

New Update
Miss Shetty Mr Polishetty: అనుష్క చికెన్ కర్రీ.. ప్రభాస్ పలావ్.. అభిమానులకు పసందే..

Anushka Shetty's Recipe Challenge: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ప్రమోషన్‌లో భాగంగా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది హీరోయిన్ అనుష్క శెట్టి. ఈ సినిమాలో చెఫ్ అన్విత ర‌వళి శెట్టి క్యారెక్టర్‌లో నటించిన అనుష్క.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రెసిపీ ఛాలెంజ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన వంటలు మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు స్పెషల్ నీర్ దోస రెసిపీలను ఎలా తయారు చేయాలో తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేసింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్‌ను మొదటగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు విసిరింది. ప్రభాస్ ఎంత పెద్ద ఫుడ్ లవర్ అనేది అందరికీ తెలుసు. ఆయన ఇష్టంగా తినడమే కాదు.. తన కో-స్టార్స్ కు, స్నేహితులకు మంచి మంచి వంటలు రుచి చూపిస్తుంటాడు. అందుకే ఫస్ట్ ప్రభాస్ కు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ విసిరినట్లు అనుష్క తెలిపింది.

అనుష్క విసిరిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ తీసుకున్న ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా తనకు రొయ్యల పలావ్ ఇష్టమని చెబుతూ ఎలా తయారు చేయాలో వివరించాడు. ఎంతోకాలంగా అనుష్క తో తనకు పరిచయం ఉన్నా ఆమె ఫేవరేట్ డిష్ తనకు తెలియదని, ఇప్పుడు తెలిసిందని ప్రభాస్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ను రామ్ చరణ్ కు ఫార్వార్డ్ చేశాడు ప్రభాస్.

సూపర్ హిట్ పెయిర్ అయిన ప్రభాస్, అనుష్క టాలీవుడ్ లో బిల్లా, మిర్చి, బాహుబలి1, బాహుబలి 2 చిత్రాల్లో కలిసి నటించి ఆడియెన్స్ ఫేవరేట్ జోడీ అయ్యారు. ఈ స్నేహంతో అనుష్క హీరోయిన్ గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్ కు సపోర్ట్ చేస్తున్నాడు ప్రభాస్.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శక‌త్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. ఈ నెల 7వ తేదీన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

Also Read:

Hyderabad: ఇలా అయితే ఎలా బతికేది.. హైదరాబాద్‌లో చుక్కలనంటుతున్న రూమ్ రెంట్స్.. 2బీహెచ్‌కే ధర ఎంతో తెలుసా?

Chandrayaan-3: చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించిన నాసా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు