Medaram Jatara : ప్రతీ భక్తుడు వీఐపీనే.. మేడారం ఏర్పాట్లపై మంత్రులు పొంగులేటి, సీతక్క కీలక ప్రకటన..
ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌లు అన్నారు. జాతర నిర్వహణకు రూ.105 కోట్లు కేటాయించామని.. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మాకు వీఐపీనేనని పేర్కొన్నారు.
Mulugu District : ఈనెల 21 నుంచి 24 వరకు ములుగు జిల్లా మేడారం(Medaram) లో సమ్మక్క, సారలమ్మ జాతర(Sammakka-Saralamma Jatara) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రులు సీతక్క(Seethakka), పొంగులేటీ శ్రీనివాస్(Ponguleti Srinivas) లు అన్నారు. సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న మంత్రులు.. ఈ మహా జాతరకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. తల్లుల దర్శనానికి గతంలో లేని విధంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు కేవలం.. తాత్కాలికి నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తే తమ ప్రభుత్వం శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యమిచ్చిందన్నారు. ఈ జాతరకు 2022లో 75 కోట్లు విడుదల చేస్తే.. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే 75 కోట్లు కేటాయించిందని చెప్పారు.
జాతరకు రూ.105 కోట్లు కేటాయింపు
అదనంగా మరో 35 కోట్లకు కూడా ప్రతిపాదనలు ఆమోదించామని తెలిపారు. 'మొత్తంగా జాతర నిర్వహణకు రూ.105 కోట్లు కేటాయించాం. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మాకు వీఐపీనే. తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జాతరలో ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రద్దీ ప్రాంతాల్లో పెయింటింగ్స్ వేయడంతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే జాతరలో పారిశుద్ధ్య నిర్వహణకు 4000 మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందించనున్నారు. చెత్తాచెదారం తరలింపు, వేస్టేజ్ ప్రాసెసింగ్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో 14 క్లస్టర్లలో 279 యూనిట్ల ద్వారా 5532 టాయిలెట్స్ ఏర్పాటు చేశాం.
కొత్తగా 230 బోర్ వెల్స్‌ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో జంపన్న వాగు లోతట్టు ప్రాంతాల్లో, రద్దీ ఎక్కువగా ఉండే చోట్ల గజ ఈతగాళ్లను నియమించాం. జంపన్న వాగులో మోకాలు లోతులో నీళ్లు ఉండే విధంగా ఈ నెల 14న లక్నవరం నీటిని విడుదల చేయడంతో పాటు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 30 స్పెషల్ హెల్త్ క్యాంపులను(30 Special Health Camps), ఆరు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాం. గతంలో కంటే రెట్టింపు విధంగా ఆర్టీసీ బస్సులు జాతరకు నడవనున్నాయి. దాదాపు 6వేల ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశాం. అలాగే పోలీస్ శాఖ నుంచి 14,000 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
వనదేవతలను తీసుకొచ్చే సమయంలో భక్తుల రద్దీని అదుపుచేసేందుకు స్పెషల్ టెక్నాలజీని వినియోగించనున్నాం. జాతరలో 500 సీసీ కెమెరాలు, ఐదు డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం భద్రత పర్యవేక్షణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. వీఐపీ, వీవీఐపీల దర్శనం వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశాం. మహా జాతర కోసం వన్ వే రూట్లు, పార్కింగ్ స్థలాలను తెలిపే మొబైల్ యాప్‌ను ఈ నెల 13వ తేదీన రిలీజ్ చేశామని' మంత్రులు తెలిపారు.

Also Read : రూ. 13 కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన చేయనున్న మోదీ!
6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు

Also Read : ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్.. కారణం అదేనా..
BIG BREAKING: ముద్రగడకు సీరియస్.. హైదరాబాద్ కు తరలింపు!
New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా...
రేషన్ కార్డు కోసం గత ఏడాది ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసినప్పటికీ మరోసారి మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాలి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Boat Accidnet: ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 28 మంది మృతి
వియాత్నంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హలోంగ్ బేలోని తుఫాను ప్రభావంతో ఓ బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. రంగంలోకి దిగిన బోర్డర్ గార్డ్స్ 12 మంది టూరిస్టులను రక్షించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Israel syria : ఇజ్రాయెల్, సిరియా మధ్య కాల్పుల విరమణ
ఇజ్రాయెల్, సిరియా లు కాల్పుల విరమణకు ఒప్పకున్నాయని తుర్కియేలోని అమెరికా రాయబారి టామ్ బరాక్ శనివారం ప్రకటించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Shiva and clap: శ్రావణంలో శివపూజ అనంతరం 3 సార్లు చప్పట్లు ఎందుకు కొట్టాలి? ఆంతర్యం ఇదే!
శివాలయంలో పూజ తర్వాత శివుని ముందు 3 సార్లు చప్పట్లు ఎందుకు కొట్టాలి? దీని వెనుక ఉన్న ధార్మిక ప్రాముఖ్యత ఏమిటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
🔴Live News Updates: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
Stay updated with the latest news in telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!