TSRTC: అందుబాటులోకి 22 ఎలక్ట్రికల్ బస్సులు..జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు TSRTC: హైదరాబాద్‌లో ప్రయాణించే బస్సు ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో నేడు 22 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తోంది. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ జర్నీ ఉంటుందని అధికారులు వెల్లడించారు. By Durga Rao 12 Mar 2024 in తెలంగాణ Uncategorized New Update షేర్ చేయండి టీఎస్ఆర్టీసీ (TSRTC)లో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ALSO READ : పూర్వజన్మల పాపాలు పోగొట్టే ఆలయ గంటలు! శాస్త్రం ఏం చెబుతోంది? తెలంగాణాలో మహలక్ష్మి పథకం లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి విధితమే . దీంతో ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కొత్త బస్సుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ నెక్లస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జెండా ఊపి 22 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారభించారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. మహిళలు ఆధార్ కార్డు చూపించి ఈ బస్సులో ప్రయాణించవచ్చు. ఛార్జ్ చేసేందుకు బీహెచ్‌ఈఎల్, మియాపూర్, కంటోన్మెంట్, హెచ్‌సీయూ, రాణిగంజ్ డిపోల్లో 33 కేవీ పవర్ లైన్లు తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు నాటికి రానున్నాయి. ఇవన్నీ నాన్ ఏసీ బస్సులే. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో వస్తున్న బస్సులని గ్రేటర్ అధికారులు చెబుతున్నారు.. మరోవైపు ఆర్టీసీ సొంతంగా 565 డీజిల్ బస్సులు సమకూర్చుకుంటోంది. ఇందులో 125 మెట్రో డీలక్స్‌లుంటాయి. ఇవన్నీ జూన్‌లో అందుబాటులోకి వస్తాయి. మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు కాగా 140 ఆర్డినరీ బస్సులు. ఈ బస్సులన్నిటిలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. #telangana-ministers #electrical-buses మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి