Ration Cards : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి! రేషన్ కార్డు లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే కసరత్తులు మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు. By srinivas 22 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana : తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్(Revanth Sarkar) త్వరలోనే మరో గుడ్ చెప్పబోతుంది. కొంతకాలంగా కొత్త రేషన్ కార్డు(Ration Card) ల కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని చూస్తున్న వారి కోరిక నేరవేర్చేందుకు కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రజా పాలన పేరుతో లబ్దిదారులనుంచి దరఖాస్తులు సేకరించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే.. ఈ మేరకు లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Elections) ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం నాగార్జున సాగర్ సెగ్మెంట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. తెలంగాణలో కాంగ్రెస్‌కు పోటీ లేదన్నారు. 14 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని, నల్లగొండ, భువనగిరిలో ఆ రెండు పార్టీలు గల్లంతు కావడం ఖాయమన్నారు. అలాగే మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని విమర్శించారు. ఇది కూడా చదవండి: Dawood Ibrahim: దావుద్ తో స్టార్ హీరో భార్యకు సంబంధాలు.. ఆ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన నటి! రాహుల్ గాంధీని ప్రధానిగా చూడబోతున్నాం.. ‘పదేళ్లుగా బీజేపీ(BJP) ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. ఈ పార్లమెంట్ ఎన్నికలతో దేశ దశ, దిశ మారబోతుంది. భారీ మెజార్టీతో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడబోతున్నాం. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓట్లు అడిగే హక్కు లేదు. ఈ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది’ అంటూ తనదైన స్టైల్ లో జ్యోష్యం చెప్పారు. #telangana #uttam-kumar-reddy #ration-card మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి