Rythu Bandhu: రైతు బంధుపై కీలక అప్డేట్ రైతుబంధు నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని అన్నారు. అలాగే ఒకేదఫాలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రైతులు ఎవరు అధైర్యపడొద్దని అన్నారు. By V.J Reddy 17 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rythu Bandhu: రైతుబంధు నిధుల కోసం ఎదురుచూస్తున్నా తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) తీపికబురు అందించారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమవుతాయని అన్నారు. నిజామాబాద్‌లో (Nizamabad) జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతుబంధుపై (Rythu Bandhu) నిధులు ఇంకా రైతుల ఖాతాలో జమ కాకపోవడంపై వివరణ ఇచ్చారు. ALSO READ: అద్దంకి దయాకర్ కు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ నెలఖారుకు రైతులందరికీ రైతుబంధు అందిస్తామని మంత్రి తుమ్మల అన్నారు. రైతుబంధు నిధుల జమపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎకరంలోపు రైతులకు రైతుబంధు జమ చేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రైతుబంధు జమ చేస్తామని చెప్పారు. మొత్తం రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య 70 లక్షలు ఉన్నట్లు తెలిపారు. 29 లక్షల మందికి రైతుబంధు జమ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటిరవకు రైతుల ఖాతాల్లో రూ.700 కోట్ల నిధుల జమ చేసినట్లు వెల్లడించారు. రూ.2లక్షల రుణమాఫీ.. రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఒకేదఫాలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. రైతులకు ఇచ్చిన హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రైతులు ఎవరూ అధైర్య పడొద్దని తుమ్మల భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రూ.2లక్షల వరకు ఏకకాలంలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. రైతు రుణమాఫీపై ఇప్పటికే కాంగ్రెస్‌ను బీఆర్‌ఎస్ పార్టీ టార్గెట్ చేసింది. రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్.. తెలంగాణలోని రైతులు బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్న క్రాప్ లోన్ల(Crop Loans) వల్ల వారిపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం కోసం రేవంత్ సర్కార్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం. తర్వాత బ్యాంకులకు విడతలవారీగా ప్రభుత్వం కట్టనుంది. ఇందుకోసం SLBC, ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది సర్కార్. 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తించనుంది. రూ.28వేల కోట్ల మేర లోన్లు ఉంటాయని బ్యాంకర్లు ప్రభుత్వానికి తెలిపారు. ఇందులో రూ.లక్ష వరకు ఉన్న పంట రుణాలే 80శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ చేయడం ద్వారా దాదాపు 30లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ALSO READ: Mega DSC: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ.. మంత్రి కీలక ప్రకటన DO WATCH: #thummala-nageswara-rao #rythu-runamafi #rythu-bandhu #telangana-latest-news #congress-six-guarantees మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి