Smriti Irani: ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభుత్వాలు, కంపెనీలు పీరియడ్స్ సెలవులు (Paid Period Leave) ఇస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో మహిళా ఉద్యోగులకు సెలవు ఇచ్చి విషయం మీద పార్లమెంటులో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రతిపాదనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతీ ఇరానీ వ్యతిరేకించారు. మహిళలకు పీరియడ్స్ అనేవి జబ్బేమి కాదు. ఆమె జీవితంలో అదొక ప్రక్రియ అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా పని ప్రదేశంలో ఇలాంటి సెలవులు ఇస్తే వివక్షకు దారి తీయొచ్చని రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్మృతి చెప్పారు.
Also read:చాలా రోజులు కోలుకోలేకపోయా..వరల్డ్ కప్ తర్వాత తొలిసారి స్పందించిన రోహిత్
పీరియడ్స్ సెలవుల మీద ప్రతిపాదనలను ప్రస్తుతం ప్రభుత్వం ఏమీ పరిశీలించడం లేదని సృతి చెబుతున్నారు. పీరియడ్స్ సమస్యలు పెద్దగా తీవ్రమైనవి కావు. కొంతమందికి మాత్రమే డిస్మెనోరియా లాంిటివి ఉంటాయి. మిగతావి అన్నీ మందులతో నయమైపోతాయి. అందుకే దాన్ని పెద్ద ఇష్యూ చేయడం మంచిది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే స్మృతి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. ఆడవాళ్ళకు రుతుక్రమం శారీరకంలో ఒక భాగమే అయినప్పటికీ...దాన్ని బాధ అనకపోవడం సరైనది కాదని అంటున్నారు నెటిజన్లు. తాను స్వయంగా ఆడవారు అయి ఉండి ఇలా ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ అయి ఉండి ఆమే ఇలా మాట్లాడితే ఇతరులకు ఎలా అర్ధమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు స్మృతి తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నారు. నెలసరికి సెలవులు ఇవ్వకపోయినా...దాని మీద పాటించాల్సిన శ్రద్ధమీద ప్రభుత్వం ప్రత్యే దృష్టిని పెట్టిందని చెబుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించిందని చెప్పారు. ఇప్పటికే ప్రమోషన్ ఆఫ్ మెనుస్ట్రువల్ హైజీన్ మేనేజ్ మెంట్ స్కీమ్ అముల్లో ఉందని తెలిపారు.