Congress: కేసీఆర్ కు లీగల్ నోటీస్ పంపించిన మంత్రి సీతక్క

‘ఇందిరమ్మ రాజ్యం, ఇసుక రాళ్ల రాజ్యం’ అంటూ పార్టీ ట్విట్టర్ అఫిషియల్ హ్యాండిల్‌లో బీఆర్ఎస్ పోస్టులు చేసింది. ఈ పోస్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సీతక్క.. బీఆర్ఎస్ అఫిషియల్ అకౌంట్ కావడంతో దానికి బాధ్యుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లీగల్ నోటీసులు పంపించారు.

New Update
Minister Seethakka: బీజేపీ మెప్పు కోసమే.. కేసీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్

Legal Notices To KCR: గులాబీ బాస్‌ కేసీఆర్ కు మరోసారి పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేలు పార్టీ నుంచి జంప్‌, కమిషన్ల విచారణ వంటి అంశాలతో సతమతమవుతున్న కేసీఆర్‌ కు మరో షాక్‌ తగిలింది. మంత్రి సీతక్క (Minister Seethakka) కేసీఆర్‌ కు లీగల్‌ నోటీసులు పంపించారు.

పరోక్షంగా మంత్రి సీతక్కను ఉద్దేశిస్తూ.. ‘ఇందిరమ్మ రాజ్యం, ఇసుక రాళ్ల రాజ్యం’ అంటూ పార్టీ ట్విట్టర్ అఫిషియల్ హ్యాండిల్‌లో బీఆర్ఎస్ పోస్టులు చేసింది. ఈ పోస్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సీతక్క.. బీఆర్ఎస్ అఫిషియల్ అకౌంట్ కావడంతో దానికి బాధ్యుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లీగల్ నోటీసులు పంపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

నిరాధార ఆరోపణలు తగవని సీతక్క హెచ్చరించారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు గానూ కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీసులో సీతక్క డిమాండ్ చేశారు. కాగా, పవర్ కమిషన్ నోటీసులనే పట్టించుకోని కేసీఆర్.. సీతక్క లీగల్ నోటీసులపై ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి.

Also Read: మహానందిలో మరోసారి చిరుత సంచారం!

Advertisment