Minister Roja: 'నా ఉసురు తగిలింది'.. చంద్రబాబుపై రోజా సంచలన కామెంట్స్..

నాకు ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. అవినీతిపరుడు నీచుడు ఇవాళ జైలుకు వెళ్తున్నాడు. నాకు ద్రోహం చేసిన నాటినుండి చంద్రబాబు పతనాన్ని కోరుకుంటున్నా.' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా.

New Update
Minister Roja: 'నా ఉసురు తగిలింది'.. చంద్రబాబుపై రోజా సంచలన కామెంట్స్..

Minister Roja on Chandrababu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు(Chandrababu Naidu) అరెస్ట్ అవడంపై రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా(Minister Roja) స్పందించారు. ఇప్పుడు తానా చాలా హ్యాపీగా ఫీలవుతున్నట్లు చెప్పారు. తన ఉసురు చంద్రబాబుకు తగిలిందని వ్యాఖ్యానించారు రోజా. చంద్రబాబు అరెస్ట్‌తో ఇవాళ రాష్ట్ర ప్రజలుకు ఎంతో శుభదినం అని అన్నారు రోజా. 'నాకు ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. అవినీతిపరుడు నీచుడు ఇవాళ జైలుకు వెళ్తున్నాడు. నాకు ద్రోహం చేసిన నాటినుండి చంద్రబాబు పతనాన్ని కోరుకుంటున్నా.' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. ఇక చంద్రబాబు అరెస్ట్‌ను విపక్ష పార్టీల నేతలు ఖండించడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. కమ్యూనిస్టులు చంద్రబాబుకు కమ్మసన్నాయి వాయిస్తున్నారని విమర్శించారు. ఇక పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకొని చంద్రబాబుకు పని చేస్తున్నాడని అన్నారు.

ఇదే సమయంలో నారా లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. లోకేష్‌ను ఐరన్ లెగ్‌తో పోల్చారు. వ్యవస్థలను చేతిలో పెట్టుకున్న చంద్రబాబు.. ఇంతకాలం తనను ఎవరూ ఏమీ చేయలేరని ఎగిరెగిరి పడ్డారని, ఇవాళ ఆయనకు తెలిసివచ్చిందని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు అరెస్ట్‌పై పురందేశ్వరి స్పందించడంపైనా ఆమె రియాక్ట్ అయ్యారు. ఎన్నడూ లేనిది పురంధేశ్వరికి బావపై ప్రేమ ఎక్కువైనట్లుందని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నేడు జైలుకు వెళ్తున్నది ఒక్క కేసులోనే అని, ఇంకా అనేక కేసుల్లో జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుందని చంద్రబాబపై షాకింగ్ కామెంట్స్ చేశారు మంత్రి రోజా.

బాంబులు పేల్చి సంబరాలు..

అంతకు ముందు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునివ్వగా.. రోజా సంబరం అంబరాన్నింటింది. ఇంటి ముందు భారీ ఎత్తున టపాసులు కాల్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, పార్టీ కార్యకర్తలకు, తన అనుచరులకు స్వీట్స్ తినిపించి సంతోషం వ్యక్తం చేశారు.

Also Read:

Chandrababu Arrest Live Updates: చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు.. ఎలాంటి ఫెసిలిటీస్ అంటే..

Pawan Kalyan: ఈరోజు నుంచి రాజకీయ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం: పవన్

Advertisment
తాజా కథనాలు