Minister Roja Warning to Balakrishna: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు(MLA Balakrishna) మంత్రి రోజా(Minister Roja) మాస్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన మంత్రి రోజా.. అసెంబ్లీలో బాలకృష్ణ మీసం మెలేయడంపై సీరియస్గా స్పందించారు. మీ బావ చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే మీసం మెలేశారా అని సెటైర్లు వేశారు. ఫ్లూటు జింక ముందు ఊదు.. జగన్ ముందు కాదంటూ బాలకృష్ణకు రోజా వార్నింగ్ ఇచ్చారు. ఆయన బావ చంద్రబాబు కోసం బాలకృష్ణ అసెంబ్లీలో హడావిడి చేస్తున్నాడని మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ.. అసెంబ్లీకి ఎన్ని సార్లు వచ్చారని ప్రశ్నించారు. ‘షూటింగ్లో అమ్మాయిలకు ముద్దు పెట్టాలి.. కడుపు చేయాలని చెప్పే బాలకృష్ణ.. అసెంబ్లీకి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు.’ అంటూ నిప్పులు చెరిగారు. సభలో తాము 151 మంది ఉన్నామని, టీడీపీ వారు 23 మందే ఉన్నారని పేర్కొన్న మంత్రి రోజా.. తాము కూడా వారిలా చేస్తు సభలో ఉండగలరా? అని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: బాలకృష్ణా.. నీ ఫ్లూటు అక్కడ ఊదు.. మంత్రి రోజా మాస్ వార్నింగ్..
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి రోజా మాస్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన మంత్రి రోజా.. అసెంబ్లీలో బాలకృష్ణ మీసం మెలేయడంపై సీరియస్గా స్పందించారు.
Translate this News: