/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Minister-Puvvada-Ajay-vs.-Thummala-Ponguletiga-mobilizations-in-Khammam-district-1-jpg.webp)
Puvvada Ajay Vs Ponguleti Srinivas: ఖమ్మం (Khammam) నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ గూటికి ముగ్గురు బీఆర్ఎస్ (BRS) నగర కార్పొరేటర్లు చేరిన విషయం తెలిసిందే. నేడు రఘునాథపాలెం బీఆర్ఎస్ ఎంపీపీ కాంగ్రెస్‌లో చేశారు. తుమ్మల (Thummala Nageswara Rao), పొంగులేటిని బందిపోట్లు అంటూ వారిని మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) విమర్శలు చేశారు. తన వాళ్లను ప్రలోభాలకు గురి చేసి బెదిరింపులకు దిగుతున్నారని మంత్రి ఆరోపించారు. ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇరువర్గాలు తెరలేపాయన్నారు. కాగా.. తొమ్మిదేళ్ల తరువాత తిరిగి పోరుకు పువ్వాడ, తుమ్మల సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్‌లోకి పోలేదు.. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతాం.. బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని ప్రజలు తెలుపుతున్నారు.
మా అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చారు
మంత్రి పువ్వాడ సమక్షంలో మాజీ కార్పొరేటర్ లక్ష్మీ సుజాత రవికాంత్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు మా ప్రమేయం లేకుండా బలవంతంగా కాంగ్రెస్ కండువా కప్పి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హేయమైన చర్య అని మాజీ కార్పొరేటర్ ఉట్కురి లక్ష్మీ సుజాత రవికాంత్ ధ్వజమెత్తారు. ఖమ్మం నగరం డివిజన్‌లో జరిగిన సమావేశం వద్దకు వచ్చి పువ్వాడ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ఈరోజు మా అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చి తమ వెంట తెచ్చుకున్న కండువాలు మెడలో వేసి ఫోటోలు తీయడం సిగ్గుచేటన్నారు.
బలవంతంగా చేర్చుకోవడం పద్దతి కాదు
కనీసం మా అనుమతి కూడా అడగకుండా ఇలా దౌర్జన్యంగా పార్టీలోకి బలవంతంగా ఎందుకు తీసుకోవడం అని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పార్టీలోనే కొనసాగుతున్నామని స్పష్టంగా చెప్పినప్పటికీ బలవంతంగా చేర్చుకోవడం పెద్ద మనిషి హోదాలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఇలా చేయడం పద్దతి కాదని హితవు పలికారు. మేము బీఆర్ఎస్ పార్టీలో (BRS Party) గౌరవంగా కొనసాగుతున్నామని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నామని, ఇక ముందు కూడా చేస్తామని మాజీ కార్పొరేటర్ ఉట్కురి లక్ష్మీ సుజాత రవికాంత్ స్పష్టం చేశారు. దయచేసి తప్పుడు ధోరణిలో మా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇలాంటి బలవంతపు చేరికలు చేయొద్దు అని సూచిస్తున్నామని చెప్పారు. పువ్వాడ అజయ్ కుమార్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పని చేసి గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ప్రకాశం జిల్లాలో కల్తీ పాల కలకలం..నూనె, ఉప్పుతో పాల తయారీ