తుమ్మలది ఆది నుండి అధర్మ పోరాటమే.. పువ్వాడ సంచలన వ్యాఖ్యలు

తన నామినేషన్ ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్. తుమ్మల చేసేది వెన్నుపోటు రాజకీయాలని విమర్శించారు. తాను పక్కాగా అన్ని వివరాలు అఫిడవిట్ లో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు.

New Update
తుమ్మలది ఆది నుండి అధర్మ పోరాటమే.. పువ్వాడ సంచలన వ్యాఖ్యలు

Puvvada Vs Thummala: ఖమ్మంలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరుకుంది. తాజాగా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అది నుండి అధర్మ పోరాటమే అని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) అన్నారు. గతంలో తన మీద పోటి చేసి ఓడిపోయినప్పుడు కూడా కోర్టులో కేసు వేసి తుమ్మల ఓడిపోయాడని అన్నారు. ఇప్పుడు తన నామినేషన్ ను తిరస్కరించాలని ఎన్నికల అధికారులకు పిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఆఫీడవిట్ లో అన్ని సరిగ్గా పొందుపరచినా.. అయన చెప్పగానే రిటర్నింగ్ ఆఫిసర్ రద్దు చేస్తారా?... అయన చెప్పినట్టు చేస్తే మంచోళ్ళు, చెయ్యకపోతే చేదోళ్ళ అని ప్రశ్నించారు.

ALSO READ: రుణమాఫీపై కీలక అప్డేట్.. చదవండి!

తప్పులు ఉంటే ఎన్నికల అధికారులు నోటీస్ ఇస్తారని... తనకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని అన్నారు. అధికారులు నోటిస్ ఇవ్వలేదు అంటే తన నామినేషన్ సరైంది అనేగా అర్థం అని పేర్కొన్నారు. తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే తనకు ఉదయం 10.30 గంటలకే నోటీస్ ఇచ్చేవారని.. తనకు అన్ని అర్హతలు ఉన్నాయి అని అధికారులు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) రెండు చోట్ల నామినేషన్ వేశారు. కొడంగల్ లో అతను నామినేషన్ వేసిన సెట్ లో ఏడు కాలాలు ఉన్నాయి. ఈసీ ఫార్మాట్ ప్రకారం లేదని వెల్లడించారు. తుమ్మల చెప్పినట్టుగా చెయ్యాలి అంటే ముందుగా రేవంత్ రెడ్డి నామినేషన్ రద్దు చెయ్యాల్సి ఉంటుందని అన్నారు. అధర్మం పోరాటం కాదు ధర్మం పోరాటం చెయ్యాలి అని తుమ్మలకు సూచించారు మంత్రి పువ్వాడ. అబద్దపు ప్రచారం చెయ్యకండి, మీ నలభై రాజకీయ జీవితానికి మచ్చలా మిగిలిపోతుంది. గడచిన ఇన్నేళ్ల పాటు మీరు చేసింది ఇదే అని తుమ్మలకు చురకలు అంటించారు. ఎన్నికల్లో ధైర్యంగా పోరాటం చెయ్యాలి, పిరికోడు మాత్రమే వెన్నుపోటు పొడుస్తారని అన్నారు.

ALSO READ: సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే?

Advertisment
తాజా కథనాలు