Ponnam Prabhakar: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

ఎమ్మెల్యే లాస్యనందిత ప్రమాద ఘటనతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతిభలేని డ్రైవర్లను నియమించుకోవద్దని పొన్నం సూచనలు చేశారు.

New Update
Ponnam Prabhakar: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

Fitness Test to VIP Car Drivers: కారు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) ఘటనతో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటన చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar). 33 జిల్లాల్లో ఎక్కడికక్కడ రవాణాశాఖ ఆధ్వర్యంలో ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించాలని.. ప్రతిభలేని డ్రైవర్లను నియమించుకోవద్దని పొన్నం సూచనలు చేశారు. ఇటీవల ప్రభుత్వ విప్‌ అడ్లూరి కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే పీఏ పై కేసు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పఠాన్ చెరు పోలీసులు. 304ఏ ఐపీసీ సెక్షన్ కింద లాస్య పీఏ ఆకాష్ (PA Akash) పై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపాడని లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు పేర్కొంది అని సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు తెలిపారు. అతివేగంగా కారు నడిపి ఎమ్మెల్యే లాస్య మృతికి కారణమయ్యాడని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ముందువెళ్తున్న వేరే వాహనాన్ని లాస్య కారు ఢీకొట్టినట్లుందని.. సీటు బెల్టు కూడా పెట్టుకున్నట్టే ఉందని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి త్వరలోనే ప్రమాదానికి గల కారణాలను వెలికి తీస్తామని ఆయన తెలిపారు. 

మూడు సార్లు..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆమెతో పాటు కారులో ఉన్న డైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరి లో లాస్య నందిత తండ్రి , ఎమ్మెల్యే సాయన్నమృతి చెందారు. సరిగా ఏడాది తరువాత లాస్య కూడా మృతి చెందడంతో పార్టీ వర్గాలు దుఃఖంలో మునిగిపోయాయి.కొద్ది రోజుల క్రితం లాస్య ఒక లిప్టులో మూడు గంటలు ఇరుక్కొని ఇబ్బంది పడగా, ఇటీవలనల్గొండ సభకు వెళ్లినప్పుడూ కూడా ఆమె కారు కు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అప్పుడు ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. కానీ మూడవసారి ఆమెను మృత్యువు కబలించింది.

Also Read: బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే!

Advertisment
తాజా కథనాలు