Saudi Arabia : మరో గల్ఫ్ (Gulf) బాధితుడికి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అండగా నిలిచారు. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్నానంటూ సోషల్ మీడియా (Social Media) వేదికగా అవేదన వ్యక్తం చేసిన వీరేంద్ర కుమార్, అతని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. వీరేంద్రను స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
ఈ మేరకు ఓ ఏజెంట్ ఖతర్ లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి తనను సౌదీలోని ఎడారిలో ఒంటెల కాపరిగా పడేశారని వీరేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని వీడియో పోస్ట్ చేశాడు. తనకు ముక్కులోనుంచి రక్తం కారుతోందని, టాయిలెట్ కూడా రావట్లేదంటూ కన్నీరుపెట్టుకున్నాడు. ఒంటెల మధ్య గుడారాల్లో బతకలేకపోతున్నానని, తాగాడానికి నీరు, తినడానికి తిండి లేదంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. తనను ఎలాగైన ఆ నరకం నుంచి కాపాడి ఇంటికి తీసుకెళ్లాలని వేడుకున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఇటీవలే కువైట్ వెళ్లిన మరో బాధితుడికి నారా లోకేష్ భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read : ఎల్లుండి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ