Lokesh Praja Darbar : మంగళగిరి (Mangalagiri) ప్రజల కోసం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రజా దర్బార్ మొదలు పెట్టారు. లోకేష్‌ను కలిసి జనాలు వారి సమస్యలు చెప్పుకుంటున్నారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కారిస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారుల్ని మంత్రి లోకేష్ (Minister Lokesh) ఆదేశించారు.
మంగళగిరి ప్రజల కోసం..
మంగళగిరి ప్రజల కోసం ప్రజాదర్బార్ (Praja Darbar) నిర్వహించినట్లు మంత్రి లోకేష్ చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. భారీ మెజార్టీతో గెలిచిన తనపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రజలతో కలుస్తానని తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రజలకు కలిసి వారి సమస్యలు తెలుసుకుంటా అని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
Also Read : పవన్ చాంబర్‌పై కొనసాగుతున్న కసరత్తు.. గతంకంటే భిన్నంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.!