Telangana: రూ.20 వేల కోట్లతో వరద సమస్యలు పరిష్కరిస్తాం.. మంత్రి కేటీఆర్ హామీ..

హైదరాబాద్‌లో రూ.20 వేల కోట్లతో వరద సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని అన్నారు. ప్రస్తుతం 70 కి.మీ మెట్రో ఉండగా దాన్ని 400 కిలోమీటర్లకు పెంచుతామని తెలిపారు.

Telangana: రూ.20 వేల కోట్లతో వరద సమస్యలు పరిష్కరిస్తాం.. మంత్రి కేటీఆర్ హామీ..
New Update

హైదరాబాద్‌లో వర్షాలు పడితే పరిస్థితులు ఎలా ఉంటాయే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్లన్ని జలమయం అయిపోతాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునుగుతాయి. ఇక వరదలు వస్తే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి. అయితే తాజాగా దీనిపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో రూ.20 వేల కోట్లతో వరద సమస్యలను పరిష్కరిండానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే 2036 నాటికి ఒలంపిక్ క్రీడలు సైతం నిర్వహించే స్థాయిలో ఆధునిక స్టేడియాలు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు. రాయదుర్గంలోని యూ-ఫెర్‌వాస్‌(యూనియన్‌ ఆఫ్‌ ఫెడరేషన్స్‌ రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్స్‌) ఆధ్వర్యంలో నగరంలోని కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు.

Also Read: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..

'2052 వరకు నీటి సమస్యలు తలెత్తకుండా నీటి వనరులను తీసుకొచ్చాం. నేను 35 ఏళ్లుగా నగరంలో ఉన్నాను. కాలేజ్‌కు వెళ్లేటప్పుడు ఖైరతాబాద్‌లో జలమండలి కార్యాలయం వద్ద ప్రతిరోజూ ఖాళీ బిందెలతో మహిళలు ధర్నాలు చేసేవారు. భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యేది. మేము అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నరేళ్లలో ఆ సమస్యలు లేకుండా చేశాం. ప్రస్తుతం 70 కిలోమీటర్ల మెట్రోరైలు ఉంది. దాన్ని రాబోయే కాలంలో 400 కిలోమీటర్ల వరకు పెంచుతాం. చెత్తతో ప్రస్తుతం దాదాపు 24 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. దాన్ని 100 మెగావాట్లకు పెంచడమే మా లక్ష్యం. నగరంలో వంద శాతం మురుగు శుద్ధి జరిగేలా ప్రాజెక్టులను నిర్మించాం. మా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగేనే డిసెంబరులో ప్రారంభిస్తాం. మరో 10-12 లాజిస్టిక్‌ పార్కులను ఏర్పాటు చేస్తాం. 150 డివిజన్‌లలో 273 బస్తీదవాఖాలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు వాటిని 400కు పెంచుతాం. ఎయిమ్స్‌ లాంటి తరహాలో ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జే ఆసుపత్రులను అభివృద్ధిచేస్తాం. నిమ్స్‌లో మరో ఆరువేల పడకలను అందుబాటులోకి తీసుకొస్తామని ' మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

#telangana-news #telangana-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe