అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను..కూతురు పుట్టిన తరువాత జీవితమే: కేటీఆర్!

చిన్నతనం నుంచి అమ్మను చూసి చాలా నేర్చుకున్నానని...కుటుంబంలోనే చెల్లి అంత ధైర్య వంతురాలు లేదు అని, తన భార్య నుంచి ఓపికను, నెమ్మదిని నేర్చుకున్నానని..కూతురు పుట్టిన తరువాత మొత్తం జీవితమే మారిపోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

New Update
TS Politics: కేటీఆర్‌కు ఓటమి భయం.. ఫోన్ కాల్ ఆడియోను షేర్ చేసిన కాంగ్రెస్!

మా అమ్మ నుంచి చాలా నేర్చుకున్నానని.. కూతురు పుట్టిన తరువాత తన జీవితమే మారిపోయిందని అంటున్నారు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయన బేగంపేట్‌ లోని గ్రాండ్‌ కాకతీయ హోటల్‌ లో ఫ్యూచర్‌ ఫార్వార్డ్‌ తెలంగాణలో భాగంగా విమెన్‌ అస్క్‌ కేటీఆర్‌ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

చిన్న తనం నుంచి కూడా తండ్రి దగ్గర చనువు తక్కువే అని ఆయన వివరించారు. కేసీఆర్‌ రాజకీయాల్లో ఉండటం వల్ల అంతగా ఆయనతో సమయం గడిపేవారం కాదని కేటీఆర్‌ పేర్కొన్నారు. మా అమ్మను చూసి చాలా నేర్చుకున్నానని కేటీఆర్‌ తెలిపారు. నా భార్య శైలిమకు కూడా చాలా ఓపిక అని ఆయన వివరించారు.

నా చెల్లి కవితమ్మ గురించి మీ అందరికీ తెలిసిందే. ఎంత డైనమిక్‌ గా ఉంటుందో . మా కుటుంబంలో తనంత ధైర్యవంతులు ఎవరు లేరంటే అబద్ధం కాదు. ప్రస్తుతం మా ఇంట్లో ఉన్న ఆడవారిలో చిన్నది అంటే నా కూతురే. తను ఈ వయసులోనే చాలా బాగా ఆలోచిస్తుంది. కూతురు పుట్టిన తరువాత నా జీవితం చాలా మారిపోయింది.

ఈరోజు నగరం నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని ఆయన అన్నారు. మైనార్టీ పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి చిన్నారి పై 10 వేలకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. తెలంగాణ, ఏపీల్లో మహిళలు స్త్రీ నిధి లోన్‌ లను మహిళలు 99 శాతం చెల్లిస్తున్నారని తెలిపారు.

ఆ లోన్‌ తో వాళ్లు వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తున్నారని మంత్రి తెలిపారు. మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా తక్కువ వడ్డీతో లోన్‌ ఇస్తామన్నారు. ఫేక్‌ డీపీ మహిళలకు మాత్రమే కాదు రాజకీయ నేతలకు కూడా చాలా ప్రమాదమని పేర్కొన్నారు.మా ప్రత్యర్థులు ఫేక్‌ డీపీ ఉపయోగించి మా పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ని వాడుకుని మా పై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మహిళలకు సంబంధించి సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేస్తే బావుంటుందని..త్వరలోనే దానిని అమలులోనికి తీసుకుని వస్తామని ఆయన వివరించారు. ఈ యాప్ లో మహిళలు తమ వివరాలను కూడా చెప్పకుండానే కంప్లైంట్‌ చేయవచ్చని వివరించారు. వాళ్ల హక్కుల గురించి కూడా తెలుసుకోవచ్చు.

రాజకీయంగా కూడా చదువుకున్న మహిళలు వస్తున్నారు.. రావాలి కూడా.. అన్నారు. రక్షణ పరంగా ఇప్పటికే షి టీమ్స్ , టోల్ ఫ్రీ నంబర్ లాంటివి తీసుకొచ్చామని కేటీఆర్ అన్నారు.

Also read: నేడే వరల్డ్ కప్ ఫైనల్స్… ఆల్ ది బెస్ట్ టీం ఇండియా!

Advertisment
తాజా కథనాలు