Hyderabad: హైదరాబాద్‌లో 24 గంటల నీటి సరఫరా.. స్పెషల్ ఫోకస్ పెట్టిన మంత్రి కేటీఆర్..

తెలంగాణ ఎన్నికల నేఫథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా హైదరాబాద్‌పై ఫోకస్ పెంచారు. హైదరాబాద్‌లో నో ట్రాఫిక్, నో పొల్యూషన్, 24 గంటలు తాగునీటి సరఫరా తమ లక్ష్యంగా ప్రకటించారు మంత్రి కేటీఆర్. పండుగ తరువాత ఫుల్ ఫోకస్ పెడతామన్నారు.

New Update
Hyderabad: హైదరాబాద్‌లో 24 గంటల నీటి సరఫరా.. స్పెషల్ ఫోకస్ పెట్టిన మంత్రి కేటీఆర్..

Telangana Elections 2023: ప్రస్తుత పరిస్థితుల్లో నగరాలలో నివసించేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకూ క్రమేపీ నగర, పట్టణాల్లో జనాభా విపరీతంగా పెరుగుతోంది. దానికి తగ్గట్లే నగరాల విస్తీర్ణం కూడా జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉపాధి కోసం హైదరాబాద్‌(Hyderabad) వైపు పరుగులు తీస్తుంటారు. అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాల వారు సైతం పలు ఉద్యోగాల కోసం ఇక్కడకు వస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. జనాభా సంఖ్య పెరుగుతోంది. అయితే వీటితో పాటే ట్రాఫిక్‌, కాలుష్యం, మౌలిక సదుపాయాలు, తాగునీరు, రోడ్ల సమస్య కూడా తలెత్తుతోంది. రాష్ర్టంలో ఎన్నికల ప్రచారం కీలక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో పార్టీలన్నీ మహానగరం ఓటర్లపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌(Minister KTR) హైదరాబాద్‌పై దృష్టి సారించారు. ట్రాఫిక్‌, పొల్యూషన్‌ లేని సుందరమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అంటున్నారు. 24 గంటలు తాగునీటి సరఫరా చేయడంతో పాటు ప్రజల శాంతిభద్రతలు, హక్కులను రక్షించేందుకు అధునాతనమైన పోలీసింగ్‌ వ్యవస్థను ఏర్పాటుచేస్తామంటున్నారు. దీపావళి పండుగ తరువాత నగర వ్యాప్తంగా రోడ్‌ షోలు, సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మా లక్ష్యం అదే..

ఉమ్మడి ఏపీలో విద్యుత్‌, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో గతంలో తరచూ విద్యుత్‌ కోతలు, తాగునీటి కోసం నిరసనలు జరిగేవని చెప్పారు. శనివారం నాడు హైదరాబాద్‌లో రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిషన్‌ భగీరథ ద్వారా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, నగరంలో 24 గంటల తాగునీటిని అందించాలన్నదే మా స్వప్నమని తెలిపారు. మెట్రోను రాబోయే 10 ఏళ్లలో 415 కి.మీ విస్తరించాలన్నదే మా ఎజెండా అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

న్యూయార్క్‌తో పోటీపడుతున్నాం..

ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో పార్ట్‌నర్స్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌ ప్రోగ్రామ్‌లో మంత్రి పాల్గొన్నారు. జేఆర్‌సీ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గణనీయంగా అభివృద్ధి చేసిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పురోగతి సాధించామని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి మీ కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. ఈ మహానగరానికి చారిత్రకంగా గొప్ప పేరుందని అన్నారు. పాత హైదరాబాద్‌ నగరాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందినదని నటుడు రజినీకాంత్‌ పొగిడిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అభివృద్ధిలో హైదరాబాద్‌ న్యూయార్క్‌తో పోటీ పడుతోందని అన్నారు. గత పదేళ్లలో నగరంలో 36 ఫ్లైవోర్లు నిర్మించామని, 39 చెరువులను నవీకరించామని మంత్రి చెప్పారు. మిషన్‌ భగీరథ కార్యక్రమంతో హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని తెలిపారు. అదేవిధంగా దేశంలో నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌, తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని గుర్తుచేశారు.

15 నుంచి 22 వరకు కేటీఆర్‌ రోడ్‌ షోలు..

ఇప్పటికే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నగరంలోని పలు నియోజకవర్గాల్లో జరిగిన బూత్‌ కమిటీ కార్యకర్తల సమావేశాలు, ఆత్మీయ సమావేశాల్లో పాల్గొని పోలింగ్‌ సమయంలో వ్యవహరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల భారీ మెజార్టీ గెలుపునకు అనుసరించాల్సిన విధానాలపై శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15 నుంచి 22న నియోజకవర్గాల్లో కేటీఆర్‌ రోడ్‌ షోలు చేపట్టనున్నారు. అగ్ర ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ఈ నెల 25న సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించారు. అభివృద్ధి ఆగొద్దంటే.. బీఆర్‌ఎస్‌ పార్టీని ఆశీర్వదించాలని.. తొమ్మిదిన్నరేళ్లలో చేసిన హైదరాబాద్‌ అభివృద్ధిని చూసి ఓటేయాలని అభ్యర్థులు ఓటర్లను కోరుతున్నారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

Also Read:

ప్రధాన పార్టీలకు రెబల్స్ గండం.. బుజ్జగింపులు షురూ చేసిన అగ్రనేతలు..

ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? పార్టీల వారీగా వివరాలు..

Advertisment
తాజా కథనాలు