Telangana: కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర.. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్..

కాంగ్రెస్ విడుదల చేసిన మైనార్టీ డిక్లరేషన్‌పై మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి సంయుక్తంగా ఈ డిక్లరేషన్‌ను ప్రిపేర్ చేసినట్లుగా ఉందని విమర్శించారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నమే ఈ డిక్లరేషన్ అని విమర్శించారు కేటీఆర్.

Telangana: కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర.. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్..
New Update

Minister KTR: కాంగ్రెస్ ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఈ డిక్లరేషన్‌ను కాంగ్రెస్, బీజేపీ సంయుక్తంగా తయారు చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మాట్టాడారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్‌ అంతా బూటకం అని విమర్శించారు. బీజేపీ ఐడియాలజీతో కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్(Congress Minority Declaration) ఇచ్చినట్లుగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తప్పుడు వాగ్ధానాలు చేయడం కొత్తేమీ కాదని, గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ డిక్లరేషన్‌లో ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని పేర్కొన్నారని, అలా చేస్తే మైనారిటీల ప్రత్యేక హోదా పోతుందన్నారు కేటీఆర్. మైనారిటీ డిక్లరేషన్‌ పేరుతో బీసీలకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోందని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నమే ఈ డిక్లరేషన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.

2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీల కోసం ఏం చేసిందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రత్యేక సబ్‌ ప్లాన్ తీసుకొస్తామంటున్న కాంగ్రెస్.. వారు అధికారంలో ఉన్న సమయంలో కేవలం రూ. 930 కోట్లు ఇచ్చిందన్నారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్ల కాలంలో మైనారిటీలకు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు మంత్రి కేటీఆర్.

Also Read:

లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్.. మరో అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. ఎవరంటే..

సీఎం జగన్ కారును ఢీకొన్న మరో కారు.. తృటిలో తప్పిన ప్రమాదం..

#telangana-elections-2023 #congress #minister-ktr #telangana-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe