Minister KTR: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌కు సిద్దం

ఎన్ని కుట్రలు చేసినా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించిన కేటీఆర్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. కలలో కూడా ఊహించని విధంగా సూర్యాపేట జిల్లా అభివృద్ధి చెందిందన్నారు.

New Update
Minister KTR: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌కు సిద్దం

KTR Challenge To Komatireddy Venkat Reddy: ఎన్ని కుట్రలు చేసినా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి (Jagadish Reddy) విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించిన కేటీఆర్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. కలలో కూడా ఊహించని విధంగా సూర్యాపేట (Suryapeta) జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. ఇక్కడ ప్రతిపక్షాలు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. మరోవైపు జిల్లాలో బీఆర్‌ఎస్‌ (BRS) నేతలను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్ష నేతలు శిఖండి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. జగదీశ్వర్‌ రెడ్డికి సూర్యాపేటలో డిపాజిట్‌ కూడా రాదని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారన్న ఆయన.. కోమటి రెడ్డి సవాల్‌కు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) సూర్యాపేట జిల్లాలో ఏం చేసిందో చెప్పాలన్నారు. సూర్యాపేటలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫ్లై ఓవర్‌ మాత్రమే ఏర్పాటు చేశారని, అంతకు మించి సూర్యాపేటకు వాళ్లు చేసింది ఏముందని ఆయన ప్రశ్నించారు. సూర్యాపేటలో కాంగ్రెస్‌ పార్టీ పేదలను బెదిరించి ఓట్లు దండుకునేదని, వారికి ఓట్లు వేయని వారిని గుర్తించి అర్దరాత్రి హత్యలకు పాల్పడే వారని కేటీఆర్‌ గుర్తు చేశారు. హత్యా రాజకీయాలకు పాల్పడే పార్టీని ప్రజల దూరం పెట్టారని కేటీఆర్‌ తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్‌ నేతలు రానున్న ఎన్నికల్లో విజయం సాధించలేక జిల్లాలో 24 గంటల విద్యుత్‌ రావడం లేదని ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అనుమానం ఉన్న కాంగ్రెస్‌ నేతలు వస్తే వారికి బస్సులో తిప్పి చూపిస్తామని మంత్రి సూచించారు. విద్యుత్‌ రావడంలేదని ఆరోపణలు చేసేవారు విద్యుత్‌ వస్తోందో రావడంలేదో తెలియాలంటే విద్యుత్‌ తీగలు పట్టుకోవాలన్నారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్, ప్రజలకు తాగు నీరు ఇవ్వని ముఖాలు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాకులు, చెవాకులు పేల్చుతున్నారని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

ALSO READ: మహాత్ముని జయంతిని అబాసుపాలు చేస్తున్నారు

Advertisment
తాజా కథనాలు