Free Current Scheme Telangana: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల (Six Guarantees) అమలు చేసేందుకు ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారెంటిలో రెండు గ్యారెంటీలను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మిగత గ్యారెంటీల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆర్టీవీతో (Rtv) మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) మిగితా గ్యారెంటీల అమలు ఎప్పుడు జరుగుతుందనే దానిపై అప్డేట్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: సీఎం జగన్ కు మరో షాక్ తగలనుందా?
హమీలను నేరవేర్చుతాం..
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో ఇచ్చిన అన్ని హమీలను (Congress 6 Guarantees) నేరవేర్చుతాం అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హమీల అమలుపై నేడు రివ్యు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతాం అని తేల్చి చెప్పారు.
వచ్చే నెల నుంచి ఫ్రీ కరెంట్..
వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ నేర వేరబోతుందని తెలంగాణ ప్రజానీకానికి గుడ్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయ్యిందని మండిపడ్డారు. అందుకే హమీల్లో కాస్త జాప్యం నడుస్తోందని అన్నారు. నిరుద్యోగ బ్రుతి మొదలుకుని డబల్ బెడ్ రూంల వరకు అన్ని హమీలను మీరు విస్మరించారని ఫైర్ అయ్యారు.
ఒక్క సీటు రాదు..
మరికొన్ని నెలల్లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలు కు పోవడం ఖాయం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతొందని తెలిపారు.
ఇది కూడా చదవండి: గజదొంగల ముఠా.. చెల్లెలు షర్మిల టార్గెట్ గా.. జగన్ విమర్శల బాణాలు!
DO WATCH: