బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవులను తృణప్రయంగా విసిరికొట్టిన నాపై...మధ్యనిషేదంలో అక్రమంగా మందు అమ్మి జైలుకు పోయిన జగదీశ్ రెడ్డి మాట్లాడటం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు నమస్తే పెడితే ఎక్కడ పని అడుగుతారో అని మోహం కిందకు వేసే అహంకారి వ్యక్తి జగదీష్ రెడ్డి అని నిత్యం ప్రజల్లో ఉండే నాపై ఆరోపణలు చేస్తుండటం విడ్డురంగా ఉందని అన్నారు.
యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కుంభకోణం, భద్రాద్రి ప్లాంట్ లో అక్రమాలు, ఛత్తిస్ ఘడ్ కరెంట్ కొనుగోళ్ల దోపిడీలు బయట పెడుతున్నాననే నాపై ఆరోపణలు చేస్తున్నాడని , ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజిలెన్స్ విచారణ, సిట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ తర్వాత జగదీశ్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా ఎవ్వరు ఆపలేరని కాస్త ఘాటుగానే స్పందించారు. ప్యారాగన్ స్లిప్పర్లు వేసుకున్న వ్యక్తి ఇవ్వాల వేల కోట్ల ఆస్తులు ఫామ్ హౌస్ లు ఎట్లొచ్చినయి.. తెలంగాణ ప్రజలకి చెప్పాలే అంటూ ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో కేసియర్ కుటుంబం తర్వాత జైలు కు పోయే రెండో వ్యక్తి జగదీశ్ రెడ్డే అంటూ మండిపడ్డారు. కేసియర్ కుటుంబంలో బావ బామ్మర్థులు తన్నుకుంటుంటే విషయం బయటికి పొక్కకుండా కెసిఆర్ ఆడించే జోకర్ జగదీశ్ రెడ్డి అని , ఇలాంటి చిల్లర వ్యక్తి నిత్యం ప్రజల్లో, ప్రజల కోసం బతికే నాపై ఆరోపణలు చేస్తాడా.. నల్గొండ ప్రజలు జగదీష్ రెడ్డిని చూసి నవ్వుకుంటున్నరు అంటూ ఎద్దేవా చేసాడు.