TG News: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ తప్పదు.. మంత్రి కోమటిరెడ్డి కేసీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్ తెలంగాణ జిన్నా లాగా మారిండు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలవడానికే హరీష్ అమెరికా వెళ్లాడు' అంటూ ఆరోపించారు. By srinivas 02 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Komati reddy: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు బయటపడుతున్నాయని.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదన్నారు. అలాగే హరీష్ రావు అమెరికా వెళ్లి రావడంపై కోమటిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఆదివారం తెలంగాణ పదేళ్ల ఆవిర్భవం సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలిపించేందుకు మే 26న ఎమిరేటెస్ ఫ్లైట్ నెంబర్ Ek 525లో హరీష్ రావును కేసీఆర్ అమెరికా పంపించినట్లు చెప్పారు. ప్రభాకర్ రావును కలవడానికే.. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలవడానికే హరీష్ అమెరికా వెళ్ళాడు. ప్రభాకర్ రావు ఇండియాకి రాకుండా ఆపేందుకే హరీష్ అమెరికా వెళ్ళాడు. ట్యాపింగ్ చేస్తూ భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారు. ప్రభాకర్ రావు అప్రూవర్ గా మారితే ఇబ్బంది అవుతుందని కేసీఆర్ భయపడుతున్నాడు. కేసీఆర్ తెలంగాణ జిన్నా లాగా మారిండు. జిన్నా కూడా ఒకరోజు ముందే స్వాతంత్ర్య దినోత్సవాన్ని చేసుకునే వాడు. కేసీఆర్ కూడా ఒకరోజు ముందే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాడు. కేసీఆర్ కి తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదు. రాక్షస పాలన పోయిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. మంత్రి పదవి రానందుకే కేసీఆర్ తెలంగాణ వాదం ఎత్తుకున్నాడు. కేసీఆర్ ఉద్యమంలో కోట్ల రూపాయలు వసూలు చేశాడు. కేసీఆర్ రాజీనామాలు చేసింది కలెక్షన్స్ కోసమే. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పాడు. కేసీఆర్ ఒక్క డీఏస్సీ కూడా పెట్టలేదు. జగన్ చేసిన మోసంతో కేసీఆర్ తెలంగాణను ఎండబెట్టిండు. వరి వేస్తే ఉరే అని ప్రజలకు చెప్పి కేసీఆర్ మాత్రం వరి వేసుకున్నాడు. గత సీఏండీ ప్రభాకర్ కి ఎప్పుడు ఫోన్ చేసినా హాస్పిటల్లో ఉన్నానని చెప్పేవాడు. అసెంబ్లీ కి వచ్చే మొహం కేసీఆర్ కి లేదు. అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలవలేదని ప్రమాణం చేయడానికి హరీష్ సిద్ధమా? ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాల్సిన అవసరం హరీష్ కి ఏమోచ్చింది? ఎన్ని రోజులైనా కేసీఆర్ ని వదిలిపెట్టేది లేదు. ప్రభాకర్ రావును వెంటనే వచ్చి పోలీసులకు లొంగిపో అని కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ కూడా తన తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: KCR: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాదే అధికారం.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటమిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి.. స్థానిక సంస్థల ఎన్నికలు వేరు దాంట్లో ఓటర్లందరూ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులే అన్నారు. బీఆర్ఎస్ క్యాంపు పెట్టి డబ్బులు పంచిందని, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు ఓటర్లను ప్రలోభపెట్టి గెలవాలి అనుకోవడం కాంగ్రెస్ నైజాం కాదన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ వేరని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. #kcr #harish-rao #omati-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి