Telangana: హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ పనులపై.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

డిసెంబర్‌లోపే హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి(NH-65) విస్తరణ పనులు పూర్తి అయిపోయేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని.. ఔటర్ రింగురోడ్డును కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

Telangana: హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ పనులపై.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
New Update

డిసెంబర్‌లోపే హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి(NH-65) విస్తరణ పనులు పూర్తి అయిపోయేలా చర్యలు తీసుకుంటామని రోడ్ల, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రహదారులపై సమీక్ష నిర్వహించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కీలకమైన ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఔటర్ రింగురోడ్డు వల్ల హైదరాబాద్‌ రూపురేఖలే మారిపోయాయని వ్యాఖ్యానించారు. అలాగే నల్గొండ బైపాస్‌ రోడ్డుకు సంబంధించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించానని తెలిపారు. ఔటర్ రింగురోడ్డును కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

Also read: సీఎం రేవంత్‌కు షాకిచ్చిన కాంగ్రెస్ హైకమాండ్..

#telangana #telugu-news #komat-reddy-venkat-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe