కర్ణాటకలో కాంగ్రెస్ తో పాటు కరువు కూడా వచ్చింది.. హరీష్ రావు సెటైర్లు!

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడ కరువు వచ్చిందని సెటైర్లు వేశారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎక్కడా కరవు లేదని తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డిపై విమర్శలు దాడి చేశారు మంత్రి హరీష్.

New Update
కర్ణాటకలో కాంగ్రెస్ తో పాటు కరువు కూడా వచ్చింది.. హరీష్ రావు సెటైర్లు!

TS Elections: తెలంగాణలో నామినేష్ల పర్వం ముగిసింది.. ప్రచారాల్లో నేతల జోష్ పెరిగింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల దండకం తార స్థాయికి చేరుకుంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో (Congress) టికెట్లను కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి రైతులను అవమానిస్తున్నారని అన్నారు. రైతుబంధు  సొమ్మును భిక్షం అంటూ అవమానించారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై అవగాహన లేదని.. అందుకే రైతులకు మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు.

ALSO READ: బిగ్ బాస్ ఫేమ్, నటి అరెస్ట్.. ఎందుకంటే?

కర్ణాటకలో అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని.. కర్ణాటకను ఇంకా దిగజార్చారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటకలో ఎటు చూసినా కరవే కనిపిస్తోందని అన్నారు. కేసీఆర్‌ (KCR) పరిపాలనలో తెలంగాణలో ఎక్కడా కరవు లేదని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో గ్రామాల్లో కరవు లేదు.. హైదరాబాద్‌లో కర్ఫ్యూ లేదని పేర్కొన్నారు. తెలంగాణలో మోసాలు చేసే కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలను తెచ్చుకోవడం ఎందుకు? అని తెలంగాణ ప్రజలను ప్రశ్నించారు. అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రారంభిస్తే.. దాన్ని ఆపాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. తెలంగాణలో రైతు బంధు, దళిత బంధు డబ్బులను ప్రజలకు ఇవ్వకుండా ఆపాలని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్ నేతలు ఛత్తీస్‌గఢ్‌లో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని చెప్పిందానికి మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఎక్కడ చూసినా వడ్లు సమృద్ధిగా పండుతున్నాయని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో వడ్ల నమూనా మనకు ఎందుకు? అని అన్నారు. వంద అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న పథకాల్లో ఒక్కటైనా ఛత్తీస్‌గఢ్‌లో ఉందా?.. ఆలోచించాలని ప్రజలను కోరారు.

ALSO READ: కాంగ్రెస్ లోకి విజయశాంతి.. క్లారిటీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు