నీ కుటుంబం మీద ఎన్ని కుట్రలు చేశారో నీకు తెలియదా పవన్: మంత్రి కొట్టు! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా వెనుక డప్పు కొట్టే మీడియా ఉందని రెచ్చిపోతున్నారని ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. టీడీపీ కౌగలిలో బంధి అయిన పవన్ కల్యాణ్ ని చూస్తూంటే జాలి వేస్తుందని ఆయన పేర్కొన్నారు. By Bhavana 01 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Minister comments on Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడా వెనుక డప్పు కొట్టే మీడియా ఉందని రెచ్చిపోతున్నారని ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. టీడీపీ కౌగలిలో బంధి అయిన పవన్ కల్యాణ్ ని చూస్తూంటే జాలి వేస్తుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు(Chandrababu) గురించి ఎన్ని పుస్తకాలు రాసినా కూడా తక్కువే. చంద్రబాబు కొడుకు లోకేశ్ ఓ పెద్ద మాలోకమంటూ ఆయన ఎద్దేవా చేశారు. లోకేశ్ చేసిన యాత్ర దేనికి సంబంధించినదో కూడా కనీసం ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. చిరంజీవి కుటుంబం పై చంద్రబాబు చేసిన కుట్రలు అందరికీ తెలుసని..నిన్ను నీ కుటుంబాన్ని తొక్కేయడానికి చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశాడన్న విషయం నీకు తెలియడం లేదా పవన్? అంటూ ఆయన ప్రశ్నించారు. పవన్ చంద్రబాబు విష కౌగిలిలో చిక్కుకుపోయారు. పవన్ పవర్ స్టార్ నుంచి ప్యాకేజీ స్టార్ గా మారిపోయారు. ఆయన అన్ని విషయాలకు నీళ్లు వదిలేశారు. అసలు పవన్ పార్టీ పెట్టడానికి ముఖ్య కారణం వైఎస్ జగన్ ని గద్దె దించడమే అని పవన్ అంటున్నాడు. కానీ పవన్ పై ప్రేమ ఉంటే ప్యాకేజ్ ఇవ్వలేదని ఏనాడైనా చంద్రబాబు చెప్పాడా అంటూ ప్రశ్నించారు. ముందు చంద్రబాబు దగ్గర నుంచి పవన్ బయటపడితేనే ఆయన రాజకీయ భవిష్యత్ బాగుటుందని మంత్రి అన్నారు. కాపులను తొక్కేయడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు గురించి పవన్ కు తెలియదా అంటూ ప్రశ్నించారు. నాటి రంగా హత్య నుంచి నేడు ముద్రగడ కుటుంబాన్ని వేధించడం వరకు కూడా కాపులను అణగదొక్కేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశాడని ఆయన తెలిపారు. చంద్రబాబు దగ్గర ఉంటే మాత్రం పవన్ కు రాజకీయ భవిష్యతు అనేది ఉండదని ఆయన అన్నారు. #chandrababu-naidu #politics #comments #ap-minister #kottu-satya-narayana #ycp-pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి